Total Pageviews

Tuesday, November 29, 2011

raitu kanta kanniru migilche rabi

రబీ పంటల సాగుపై రైతుల్లో ఉన్న ఉత్కంఠ నేడు వీడనుంది. రబీకి సాగునీటి సరఫరాకు అవకాశం లేదని ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో తేల్చటంతో రైతుల్లో ఆందోళన నెలకొనటం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఆందోళన చేపట్టటం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటిని సాధించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించటం రైతుల్లో ఆశను రేకెత్తించింది. రబీ సీజనుకు పంట విరామానికి నిర్ణయిస్తూ కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ జిల్లాలో సాగునీటి సరఫరా ఉంటుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇన్ని సందేహాల నడుమ జిల్లా ఐఏబీ సమావేశం మంగళవారం ఏర్పాటుకానుంది. ఇందులో చేసే తీర్మానంతోనే ఇన్నిరోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడనుంది.

నాగార్జునసాగర్, కృష్ణాపశ్చిమడెల్టా పరిధిలోని ఆయకట్టులో రబీ సీజనులో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తుంటారు. పశ్చిమడెల్టా కిందకు వచ్చే తెనాలి డివిజనులో వరి తర్వాత మొక్కజొన్న సాగు విస్తారంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. మరో 30 వేల ఎకరాల్లో వరి వేస్తుంటారు. ధాన్యానికి ‘మద్దతు’ తక్కువగా ఉండటం, ఎరువుల ధరలు పెరగటంతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు ఏమాత్రం గిట్టుబాటుకాని పరిస్థితిలో మొక్కజొన్న ఒక్కటే రైతులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. చిన్న సన్నకారు రైతుల ఎకరాకు రూ.20-25 వేల వరకు కౌలుకు తీసుకుని మరీ సాగుచేస్తుంటారు. ఖరీఫ్‌లో సగటు దిగుబడులు సంతృప్తికరంగా ఉండేలా కనిపిస్తున్నా ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. అందుకే మొక్కజొన్నకు సన్నాహాలు చేస్తున్నారు. కోత కోసి కుప్ప వేసిన చేలల్లో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే మొక్కజొన్నను విత్తుతున్నారు. మిగిలిన రైతులు సాగునీటి సరఫరా నిర్ణయంకోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు ఐఏబీ సమావేశంలో పంట విరామం తీర్మానం అనివార్యమైతే మొక్కజొన్న రాబడిని రైతులు వదులుకోవాల్సిందే. డివిజనులోని రైతులు హీనపక్షం రూ.1000-1200 కోట్ల పంటను కోల్పోయినట్టు కాగలదు.

అదను దాటిన పంటలు..
సాగర్ ఆయకట్టు విషయానికొస్తే, రబీలో ఎక్కువగా మిర్చి పంటకు సాగునీటి అవసరం ఉంది. ఏటా ఆగస్టు/ సెప్టెంబరులో వేసే మిర్చిని వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్నిచోట్ల అక్టోబరు/నవంబరులోనూ వేయాల్సివచ్చింది. మొత్తం 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. జనవరి-ఏప్రిల్ నెలల్లో మిర్చి కోతకొస్తుంది. కాయ ఊరే సమయంలో సాగునీటి అవసరం ఎంతగానో ఉంటుంది. పంట విరామం నిర్ణయమైతే కాలువనీటిపై ఆధారపడిన లక్ష ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింటుంది. ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే కనీసం పది క్వింటాళ్ల దిగుబడి పడిపోతుందని రైతుసంఘం జిల్లా నాయకుడు రాధాకృష్ణ చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించుకుంటే కేవలం మిర్చి పంటతోనే రైతులు రూ.300-400 కోట్ల వరకు నష్టపోతారని చెప్పారు. సాగర్ ఆయకట్టులో ప్రధానంగా మిర్చి పంటను నష్టపోవాల్సి ఉంటుంది. మరో 20 వేల ఎకరాల్లో వేసే వరిపంటకు నూకలు చెల్లిపోతాయి.

పనిదినాలను కోల్పోతున్న కూలీలు..
పంటనష్టానికి తోడు వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరిలో కోత యంత్రాలు వచ్చాక కూలీలకు పనిదినాలు తక్కువయ్యాయి. మొక్కజొన్న, మిర్చికి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. మొక్కజొన్నలో ఎకరాకు కనీసం 50, మిర్చికి 200-250 పనిదినాలు అనివార్యంగా ఉంటాయి. రబీకి నీరివ్వకపోతే రెండు పైర్లకు కలిపి దాదాపు 1.75 కోట్ల పనిదినాలను కోల్పోవాల్సి వస్తుంది. అటు రైతులకు రాబడి లేకుండా, కూలీలు ఉపాధిని కోల్పోతే ఆ ప్రభావం జిల్లా ఆర్థికపరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వేరే చెప్పనవసరం లేదు. కేవలం కాలువల ఆధునికీకరణ కోసమని పంట విరామం ప్రకటించాల్సిన అవసరం లేదని రైతులు, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం. రబీ తర్వాత ఎన్ని నెలలు విరామం వస్తే అంతవరకు చేయగలిగిన పనులు చేస్తే చాలంటున్నారు. ఆధునిక యంత్రాలు వచ్చినందున రెండు నెలల్లో చేసే పనిని నెల వ్యవధిలో చేపట్టే అవకాశముందని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ పంట విరామం ప్రకటించి అవకాశం కల్పించినా, మూడేళ్లుగా బద్ధకం వదుల్చుకోని కాంట్రాక్టు సంస్థలు ఇప్పుడు వేగంగా స్పందించి పనిచేస్తాయన్న గ్యారెంటీ ఏముందనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి.
కాని  nedu జరిగిన సమావేశం లో ప్రతిపక్ష నాయకులూ , రైతులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కలెక్టర్  సమావేశం మధ్యలోనుచి అర్ధ్హతరంగ వెళ్ళిపోవడం పలు విమరలలకు తావుఇచ్చింది. తెలుగుదేశం నాయకులు కల్లెరచ్తే ని ముట్టడించి హడావిడి చేసారు.



Saturday, June 11, 2011

'విరాళాల' పార్టీలు!



భారీగా పుట్టుకొస్తున్న కొత్త పార్టీలు
పన్ను మినహాయింపుతో సమస్యలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
నగలు కూడా కొన్న ఘనులు
 రాజకీయ పార్టీలకు, పన్ను మినహాయింపులకు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఏమైనా సంబంధం ఉందా? పైకి చూస్తే... ఏమీలేనట్లే కనిపిస్తుంది. కానీ, వీటన్నింటి మధ్య ఆసక్తికరమైన 'సంబంధం' ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలను ఆదాయపు పన్ను నుంచి మినహాయించడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. పన్ను మినహాయింపు ప్రకటించిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త పార్టీలు పుడుతున్నాయి.విరాళాల పేరిట పొందిన డబ్బులను స్టాక్ మార్కెట్‌లో పెట్టినఉదంతాలున్నాయి, నగలు కొన్నవారూ ఉన్నర్రు. చెప్పారు."ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టరైన పార్టీల సంఖ్య 1200 వరకు చేరుకుంది. ఇందులో 75 నుంచి 80 శాతం పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడమే లేదు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి ఆదాయపు పన్ను మినహాయించడంతో భారీ స్థాయిలో కొత్త పార్టీలు పుడుతున్నాయి.ఒక పార్టీ చిరునామాకు వెళ్లగా... అక్కడ టీ కొట్టు కనిపించింది. ఒక పార్టీకి అందిన విరాళాలతో నగలు కొన్నట్లు తేలింది. కొందరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కూడా పెట్టారు. అందుకే... ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఈసీకి ఉండాలి'' 
దీనికి సంబంధించి ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే పార్టీలకు అందే విరాళాలపై మాత్రమే పన్ను మినహాయింపు ఉండాలన్నారు. పార్టీల ఖాతాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, కాగ్ లేదా ఈసీ నియమించే ఆడిటర్ల చేత ఖాతాలను పరిశీలించే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. "చాలా పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్స్‌కూడా సమర్పించడంలేదు. ఇలాంటి పార్టీల వివరాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును కోరుతున్నారు.
గుంటూరు జిల్లా లో కూడా కేవలం గోడలమీద మాత్రమే కనిపించే పార్టీలు పదుల సంఖ్యలో వెలిసాయి. వీరిలో కొందరు తమ సామాజికవర్గానికి చెందిన ధనవంతులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా విరాళాలు దండుకొంటున్నారు. tadvara  న్యాయంగా ప్రభుత్వానికి చేరాల్సిన పన్నులను ఎగవీయడానికి రాజమార్గం రూపొందించారు. దళితులకు, బహుజన, పీడిత ప్రజల పక్షాన నిలుస్తామని పేరు పెట్టుకొన్న ఒక పార్టీ నాయకుడు ఈవిధమైన సంపాదనలో కోట్లు  గడించినట్లు సమాచారం. 
 అందుకే... ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఈసీకి ఉండాలి'' అని ప్రజలు కూరుకొంతున్నారు.

Monday, May 23, 2011

అన్నం పెట్టె రైతుకు మన్ను పెట్టిన ప్రభుత్వం


 'అందరికీ ఆహారo!'.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆహార బద్రత  చట్టం అందరికీ అన్నంపెట్టే రైతుకే శాపంగా మారిందా? వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ప్రస్తుతం మార్కెట్‌లో అన్నదాత పండించిన ధాన్యానికి మద్దతు ధర పలకక పోవడానికి, కొనుగోళ్లు ముందుకు సాగకపోవడానికీ.. కేంద్ర ప్రభుత్వం త్వరలో తేనున్న ఆహార భద్రత చట్టానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది! ఈ నిజాన్ని అంగీకరించేందుకు సాహసించని ప్రభుత్వం, నాయకులు, మిల్లర్లు... అంతా కలిసి రైతులతో ఆడుకుంటున్నారు. వారిని ఒక విష వలయంలోకి నెట్టేశారు. చట్టం చట్రంలో బంధించారు.

దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో సుమారు 6 వేల రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో నాలుగు వేల మంది ధాన్యం సేకరణ చేపడతారు. ఇదో శక్తిమంతమైన లాబీ! రాష్ట్రంలో లెవీ బాధ్యతను ప్రభుత్వం మిల్లర్లపైనే పెట్టింది. ఇప్పుడు.. రబీలో పండిన ధాన్యం కొనుగోళ్లు మందగించడానికి మిల్లర్లే కారణమయ్యారు. 'ధాన్యం ఎందుకు కొనరు?' అని ప్రశ్నిస్తే... 'ఇప్పటికే కొన్న ధాన్యం మా వద్ద మూల్గుతోంది. కొత్తగా ఎందుకు కొనాలి? ఎలా కొనాలి?' అనే వాదన వినిపిస్తున్నారు.

'మా దగ్గర ఉన్న బియ్యం ఎగుమతికి అనుమతిస్తే, మీ దగ్గరున్న ధాన్యం కొంటాం' అని మెలిక పెడుతున్నారు. 2008 వరకు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నారు. బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో స్థానిక మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. దీంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. మన బియ్యానికి విదేశాలలో భారీ డిమాండ్ ఉంది. ప్రధానంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన లక్షల మంది భారతీయులు మన బియ్యాన్నే తెప్పించుకుంటారు. ఇప్పుడు ఎగుమతులకు గేట్లు ఎత్తితే మిల్లర్లకు కాసుల వర్షం కురవడం ఖాయం!

అదేసమయంలో... ధాన్యం ధరలు కూడా పెరిగే అవకాశముంది. కానీ, బియ్యం ఎగుమతులకు కేంద్రం ససేమిరా అంటోంది. ఆహార మంత్రి శరద్ పవార్ నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరిదీ అదే మాట! వచ్చే వర్షాకాల సమావేశంలో కేంద్రం ఆహార భద్రత చట్టాన్ని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి కుటుంబానికి తెల్లకార్డుపై 35 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ఆ మేరకు బియ్యాన్ని నిల్వ చేయకపోతే... చట్టం చట్టుబండలవుతుంది. ఎగుమతులకు అనుమతిస్తే స్థానిక మార్కెట్‌లో ధరలు భగ్గుమంటాయి. ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్రం బియ్యం ఎగుమతులకు ససేమిరా అంటోంది.

అన్నీ కొర్రీలే...
బియ్యం ఎగుమతులకు కేంద్రం అంగీకరించకపోవడంతో... మిల్లర్లు ఆ కోపాన్ని రైతులపై చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. రబీలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి లెక్కలు చూపించి మాయాజాలం చేస్తున్నారు. కనీస మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ధాన్యం సేకరణపై పర్యవేక్షణకు నియమించిన సీనియర్ ఐఏఎస్‌లు వచ్చినప్పుడు మాత్రం మిల్లర్లు హడావుడి చేస్తున్నారు. అప్పుడైనా సక్రమంగా కొంటున్నారా అంటే అదీ లేదు. తేమ శాతం అధికంగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారు. ర్యాకులు లేవని, గోనె సంచుల కొరత ఉందని రకరకాల సమస్యలు తెరపైకి తెస్తున్నారు.

ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు వెయ్యి, 'ఎ' గ్రేడ్‌కు 1030 రూపాయల వంతున మద్దతు ధర నిర్ణయించినా... ఇది ఎక్కడా అమలు కావడంలేదు. మిల్లర్లు 800 నుంచి రూ.850లకు మించి చెల్లించడంలేదు. రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని చెబుతున్నప్పటికీ ఇప్పటికి కేవలం 33 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగసంస్థలైన పౌరసరఫరాల కార్పొరేషన్, ఐకేపీ, ఎఫ్‌సీఐ కలిపి ఎనిమిది లక్షల టన్నులు కొనగా, మిల్లర్లు 25 లక్షల టన్నులు కొన్నారు.

Thursday, May 12, 2011

engeneering vidhyardhi anumanaspada mruti

జిల్లా లోని కళాశాలలో కుల పిచ్చి raajyameluthundi.vidhyardhulu chaduvulu maani kula raajakeeyalo munigi theluthunnaru.ee nepadyamlo tarachuu brundaaluga veedi garshnalu paduthunnaru.  గుంటూరులోని శ్యామలానగర్ రైల్వేగేటు, నల్లపాడు రైలుమార్గం మధ్యలో పట్టాలపై బిటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా చంపి పట్టాలపై వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరో పది రోజుల్లో మృతుడి చెల్లి వివాహం జరగనుంది. కార్డులు పంచేందుకు వచ్చి మృత్యువాతపడ్డాడు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి.

ఈ సంఘటకు సంబంధించిన వివరాలను జీఆర్‌పి ఎస్ఐ జులకర్‌నైన్ విలేకరులకు వెల్లడించారు. వసంతరాయపురం 8వ లైనుకు చెందిన రవిబాబు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ వద్ద కారు ్రడైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్దకుమారుడు కె ఫణికోటేశ్వరరావు (19) వింజనంపాడులోని ్రపైవేట్ కాలేజిలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆమెకు చెల్లి షర్మిల. ఇదిలా ఉంటే చెల్లి వివాహం ఈ నెలలో జరగనుంది.

ఎప్పటివలె ఫణికోటేశ్వరరావు కాలేజికి వెళ్లి మధ్యాహ్నం వాంతులు కావడంతో తల్లికి ఫోన్ చేసి గుంటూరు బయలుదేరాడు. సాయంత్రానికి ఇంటికి చేరి, చెల్లి పెళ్లికావడంతో కార్డులు పంచేందుకు బయటికివచ్చాడు. తెల్లవారేసరికి కోటేశ్వరరావు రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

ఫోన్ చేసి మృతుడిని అక్కడికి పిలిపించి హతమార్చి ఉంటారని, అనంతరం కేసు నుంచి తప్పించుకునే క్రమంలో మృతదేహాన్ని పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతుడు ఉపయోగించిన సెల్‌ఫోన్ కనిపించలేదు. అక్కడ ఉన్న ద్విచక్రవాహనం ఇంజన్ నంబరు ఆధారంగా మృతుని వివరాలు ఎస్ఐ కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆగిపోయిన చెల్లి వివాహం ఫణికోటేశ్వరరావు అకాల మృతితో చెల్లెలి వివాహం వాయిదా పడింది. వివాహవేడుకలకు రావాల్సిన బంధువులు ఈ వార్త విని ద్రిగ్భాంతికి గురయ్యారు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు అలముకున్నాయి.

Sunday, May 8, 2011

కొత్త పదవి


తెనాలి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి లభించనుంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకరైనా కొంతకాలంగా స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు స్పీకర్ బాధ్యతలు నిర్వహించిన కిరణ్‌కుమార్ రెడ్డి సిీఎం కావడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మనోహర్ స్పీకర్‌గా విధులునిర్వర్తిస్తూ వచ్చారు.

మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి కల్పించనప్పటికీ ఆ బాధ్యతలను వివాద రహితంగా, సమర్థవంతంగా నిర్వర్తిస్తుండటంతో ఆయననే స్పీకర్‌గా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు, మూ డు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన మనోహర్‌కు వైఎస్ఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్ పద వి లభించింది.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడుగానే కాకుండా తన పనితీరుతో కూడా మనోహర్ అధిష్టానం వద్ద గుర్తింపు పొందారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో మనోహర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండో పర్యాయం తెనాలి టిక్కెట్‌ను మనోహర్‌కు ఇప్పించే విషయంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా నియామకం కాకముందు పీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ప్రేమ త్రికోణం

స్నేహితురాలికి ఇష్టం లేని పెళ్లి చేశా రు.. దీనిని తట్టుకోలేని నవ వధువు, ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు య త్నించిన ఘటన శనివారం తక్కెళ్ళపాడు సమీపంలో జరి గింది. భీమవరానికి చెందిన డి లావ ణ్య, తెనాలికి చెందిన ఎం సుజన గుం టూరులోని సిమ్స్ కాలేజీలో బీపీటీ కోర్సు చదువుతున్నారు. ఒకరు నాలు గో సంవత్సరం కాగా, మరొకరు ఐదో సంవత్సరం కోర్సు చేస్తున్నారు.

తాపీ మేస్త్రిగా పని చేసే తాడేపల్లికి చెందిన ఇస్కేపల్లి దిలీప్ అనే యువకుడు సుజనకు పిన్ని కొడుకు అవుతాడు. లావణ్య, సుజనలు సిమ్స్ కాలేజీలో ఒకే గదిలో ఉంటూ చదువుకుంటు న్నారు. దిలీప్ వారికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇస్తుంటాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారి ముగ్గురి మధ్య శారీరిక సంబంధం ఏర్పడినిది.

ఈ నేపథ్యంలో ఈ నెల 5న సుజనకు వివాహం జరిగింది. అయితే సుజనకు ఇష్టంలేని పెళ్లి జరిగిందని ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని తక్కెళ్ళపాడు సమీపంలోని గుంటూరు చానల్ వద్ద ఉన్న మొక్కజొన్న పొలానికి ద్విచక్ర వాహనంపై శనివారం వచ్చారు. అక్కడి గడ్డిమందు తాగారు. వీరిని గమనించిన కూలీల సమాచారంతో 108 సి బ్బంది ముగ్గురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లావణ్య, సుజనల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ్రపైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నో అనుమానాలు... లావణ్య, సుజన, దిలీప్‌ల ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇష్టంలేని వివాహం జరిగితే సుజన ఒక్కతే ఆత్మహత్య చేసుకోవాలి కాని మిగిలిన ఇద్దరు ఎందు కు ఆత్మహత్యకు యత్నించారనేది ఎవరి కీ అర్థం కావడం లేదు. శుక్రవారం లగేజీతో ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య శనివారం మధ్యాహ్నం వర కు ఎక్కడ ఉన్నాదో తెలియాల్సి ఉంది. పొలంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురి మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. వారి మధ్య ఘర్షణ కారణాలేంటో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మీడియాపై ఆగ్రహం ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురి ఉదంతం తెలిసి జీజీహెచ్‌కు వెళ్లిన మీ డియాపై ప్రతిని««ధులపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీటీ విద్యార్థినుల ఆత్మహత్యాయత్యం విషయా న్ని గోప్యంగా ఉంచాలని వైద్యులు ప్రయత్నించారు. ఫొటోలు, వీడియో తీస్తుం డగా వైద్యులు అడ్డుకున్నారు. దీంతో మీడియా, వైద్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.

స్థానిక పోలీసులు కూడా తమకు పట్టీపట్టనట్టుగా వ్యవహరించారు. ఎంఎల్‌సి కేసు నమోదు చేయకుండానే క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి పంపించివేశారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు సూపరింటెండెంట్ ఫణిభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.

Saturday, April 30, 2011

అగ్ర కులం అగచాట్లు



దేవుడా ఏమిటీ దుస్థితి!
వెనకబడిన బ్రాహ్మణులు..
దారిద్య్ర రేఖకు దిగువన 55 శాతం మంది

నెలకు వారి తలసరి ఆదాయం రూ.650 లోపే
బిడ్డలను చదివించుకోలేని దుస్థితి
పది, ఇంటర్‌తోనే చదువులకు స్వస్తి
రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్‌లకు దూరం
నెలకు రూ. 500తో జీవించే కుటుంబాలెన్నో
బ్రాహ్మణుల దుస్థితిపై జె. రాధాకృష్ణ సర్వే

హైదరాబాద్, ఏప్రిల్ 30 : 'లోకాఃసమస్తాం సుఖినోభవంతు' అంటూ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలి అని కోరుకునే బ్రాహ్మణులు ఇప్పుడు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు అన్ని వర్గాలకూ మార్గనిర్దేశకులు ఇప్పుడు దారీతెన్నూ కనిపించక అలమటిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించే గురువులుగా కీర్తిగడించిన వారు ఇప్పుడు తమ బిడ్డలను చదివించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంచికీ చెడుకీ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్రహ్మ స్వరూపులుగా పిలిచే బ్రాహ్మణుల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు కడు దయనీయంగా మారింది.

రాష్ట్రంలో 55 శాతం మంది బ్రాహ్మణులు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. నెలకు వారి తలసరి ఆదాయం కూడా రూ.650లోపే! ఇక, బ్రాహ్మణుల్లో నిరుద్యోగుల శాతం (75 శాతం) అన్ని వర్గాల కంటే ఎక్కువ. తమ బిడ్డలను వారు ఇంటర్మీడియట్‌కు మించి చదివించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు ఇప్పుడు కుల వృత్తితోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. బ్రాహ్మణుల దుస్థితిపై జే.రాధాకృష్ణ దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఆ వివరాలతో 'బ్రాహ్మిన్స్ ఆఫ్ ఇండియా' పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించారు. ఛుగ్ పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలోని అర్చకులంతా దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. ప్రస్తుత వ్యవస్థలో వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్లు, ఆర్థిక ప్రతిబంధకాలు కలగలిసి తమ బిడ్డలకు మంచి చదువు చెప్పించలేని దుస్థితి నెలకొందని బ్రాహ్మణులు ఆవేదన చెందారు. బ్రాహ్మణ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణేతరులతో పోలిస్తే బ్రాహ్మణుల సరాసరి ఆదాయం చాలా తక్కువ. ఫలితంగా, ఇంటర్మీడియట్ స్థాయిలోనే బ్రాహ్మణ విద్యార్థుల్లో అత్యధిక శాతం చదువులకు స్వస్తి పలికేస్తున్నారు.

ఐదు నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థుల్లో.. 44 శాతం మంది ప్రాథమిక విద్య స్థాయిలోనే బడికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. 36 శాతం మంది పదో తరగతి దాటడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ బ్రాహ్మణుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా లేదని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణుల దీనావస్థకు సంబంధించిన గణాంకాలను ఇటీవల కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే చదివి వినిపించారు. క్రిస్టియన్ల తలసరి ఆదాయం రూ.1562 అయితే.. వక్క లింగాలు రూ.914, ముస్లింలు రూ.794, ఎస్సీలు రూ.680, ఎస్టీలు రూ.577 ఉంటే ఆ రాష్ట్రంలో బ్రాహ్మణుల తలసరి ఆదాయం రూ.537గా ఉందని స్పష్టం చేశారు. తొలి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అత్యధికంగా ఉండేవారు.

ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, వైద్యులు వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలనూ పొందారు. కానీ, ప్రస్తుతం బ్రాహ్మణేతరులకే పెద్దపీట వేసే ప్రభుత్వ విధాన నిర్ణయాల కారణంగా బ్రాహ్మణులు ఆయా రంగాల నుంచి ఎప్పుడో కనుమరుగయ్యారని, ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తే.. ఆ రాష్ట్రంలో అత్యధిక బ్రాహ్మణులు ఇళ్లల్లో పనివారుగా బతుకీడుస్తున్నారని రాధాకృష్ణ తన సర్వేలో వెల్లడించారు. ఇదంతా ప్రతిభ లేక.. చదవలేక కాదు.. చదువును కొనుక్కునే స్తోమత లేకనే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు వీరికి అందవు.

కేవలం నెలకు రూ.500తో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అని వెల్లడించారు. ఇందుకు కారణం.. ప్రభుత్వం నుంచి ఒక్క పథకమూ వారికి అందదు. రాష్ట్రవ్యాప్తంగా 56 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బ్రాహ్మణులు ఉన్నా.. రచ్చబండ లాంటి కార్యక్రమాలు వారికి బహు దూరం. అగ్ర కులం పేరిట నిరుపేద బ్రాహ్మణులనూ ప్రభుత్వ పథకాలకు దూరం చేసేశారు.

సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరికీ తెల్లకార్డులు అందుతాయి. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు తదితర ప్రభుత్వ పథకాలు దక్కుతాయి. కానీ, బ్రాహ్మణులకు మాత్రం ఇవన్నీ దూరమే. బ్రాహ్మణుల్లో కేవలం పది శాతం మించి ఉన్నత విద్యనభ్యసించే పరిస్థితి లేదు. 35 శాతం అర్చకులుగా, పౌరోహిత్యంలోనూ జీవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు

Courtesy: Andhrajyothy Telugu Daily


Tuesday, February 8, 2011

కాదేది కల్తికి అనర్హం


మార్కెట్‌లోకి యథేచ్ఛగా ‘నీళ్ల మద్యం’
ఇటు డిస్టిలరీ.. అటు దుకాణ యాజమాన్యం చేతివాటం
ఎక్కువ నీటిని వినియోగిస్తున్న డిస్టిలరీలు
మూత తొలగించి నీళ్లు పోస్తున్న దుకాణదారులు
పలచనవుతున్న మద్యం

పెగ్గు మీద పెగ్గు కొట్టి నడిరోడ్డుమీద స్వర్గవిహారం చేసే మందు మహరాజుల్ని అప్పుడప్పుడూ అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా కిక్కు లేదు గురూ’ అంటూ నిట్టూరుస్తున్నారు. మత్తెక్కించే మందులోనే తేడా ఉందని తెలియక జుట్టు పీక్కుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 40 శాతం నీళ్లు కలిపిన కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నారని ఇటీవలి సంఘటనలు బయటపెడుతున్నాయి. డిస్టిలరీ యాజమాన్యం, మద్యం దుకాణదారులు ఒకరికి తెలియకుండా మరొకరు విచ్చలవిడిగా మద్యం సీసాలో నీళ్లు కలుపుతుండటంతో కిక్కు తగ్గిపోతోంది. ఈ దందా డిస్టిలరీల్లోనే మొదలవుతోంది. గతంలో సీగ్రాం ఉత్పత్తులు, ఇటీవలి కాలంలో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, అశోక విస్కీల కల్తీ వ్యవహారం బ్రాండెడ్ మద్యం లోగుట్టును బయటపెట్టాయి. ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డిస్టిలరీలు లిక్కర్ తయారీలో ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) శాతం తగ్గించి నీళ్లు కలుపుతున్నాయి. ఒక్క శాతం నీళ్లు అదనంగా ఉపయోగించినా డిస్టిలరీ యాజమాన్యానికి ’ లక్షల్లో ఆదాయం ఉంటుంది. రోజుకు ఐదు వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే డిస్టిలరీ నుంచి తయారైన మద్యంలో ఒక శాతం అదనంగా నీళ్లు కలిపితే 2,500 లీటర్ల ఈఎన్‌ఏ మిగులుతుంది. దీన్ని తిరిగి మద్యం తయారీ కోసం వినియోగిస్తే 275 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. లేదంటే మిగిలిన ఈఎన్‌ఏను నేరుగా విక్రయించినా 2,500 లీటర్లకు రూ.1.20 లక్షలు (లీటర్ ధర రూ.48 చొప్పున) వస్తాయి. ఈ అదనపు లాభాలకోసమే డిస్టిలరీల యాజమాన్యాలు కల్తీకి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న అన్ని డిస్టిలరీలు కూడా సగటున రోజుకు 10 వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నవే.

మూత తీసి... నీళ్లు పోసి

డిస్టిలరీల నుంచే కల్తీతోవస్తున్న మద్యంపై దుకాణదారులు కూడా తమ చే తివాటాన్ని చూపుతున్నారు. ఎక్సైజ్ అధికారులు వేసిన సీల్ చెదిరిపోకుండా సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150 మిల్లీలీటర్ల లిక్కర్ తీసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు. అనుమానం రాకుండా తిరిగి సీల్ వేసి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎక్సైజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది నకిలీ మద్యం సీసాను, దానిపై వేసిన సీల్‌ను గుర్తుపట్టలేరు. దీంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఇలాంటి మోసాలు మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేది.

వేసిన సీల్ చెడిపోకుండా సీసాపై మూతలు తొలగించగల నిపుణులు కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వీళ్లు రూ. 5000 తీసుకుని ఆసక్తిఉన్న నిరుద్యోగ యువకులకు తర్ఫీదునిస్తున్నారు. మద్యం దుకాణాలు కూడా నమ్మకస్తుడైన తమ వ్యక్తికి సీసా మూతలు తొలగించడంలో తర్ఫీదు ఇప్పిస్తున్నాయి. దీంతో మారుమూల మండలాల్లో కూడా మద్యంలో నీళ్లు కలిసి పలచనవుతోంది. వరంగల్ జిల్లా జనగామలోని సింధుసాయి వైన్స్‌లో మూతలు తొలగించి మద్యం కల్తీ చేస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి విధానమే రాష్టవ్య్రాప్తంగా అమలవుతోందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి ఒకరు చెప్పారు.

Sunday, February 6, 2011

దళితుల వివాదం విగ్రహం తో నిరసన


వివాదాలు.. దీక్షలు.. రాజకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు గుంటూరు నగరం నడిబొడ్డున బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం నెలకొల్పారు. నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరం కూడలిలో ఆదివారం జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి దళిత నేతలతో కలసి ర్యాలీగా తరలివచ్చారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మహ్మద్‌జానీ, ఎంపీ రాయపాటి సాంబశివరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వివాదాలు సరికాదు..
విగ్రహావిష్కరణ అనంతరం విజ్ఞానమందిరం ఎదుట ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నగరంలో విగ్రహం ఏర్పాటు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదాలు మంచివి కావని హితవు పలికారు. కార్యక్రమ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సీనియర్ మంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, విగ్రహం ఏర్పాటు అందరం కలిసి కట్టుగా చేసుకున్న కార్యక్రమమని తెలిపారు. సభలో మహ్మద్‌జానీ ప్రసంగిస్తూ అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఎంపీ రాయపాటి మాట్లాడుతూ బీహార్‌లో ఆయన తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జగ్జీవన్‌రామ్ తదనంతరం ఆ రాష్ట్రంలో పార్టీ బాగా దెబ్బతిందన్నారు.

దళితులను ప్రేమించే నాయకులు కావాలి..
నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విగ్రహాలు మినహా మరో నాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయడం లేదని, అటువంటి తరుణంలో జగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. దళితులను ప్రేమించే నాయకులు, అధికారులు రావాలని అభిలషించారు. జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాలకు మార్గద ర్శకంగా నిలిచారని సభాధ్యక్షుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మస్తాన్‌వలి కొనియూడారు. సభలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, కేఎస్ లక్ష్మణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, జేసీ శరత్, అదనపు జేసీ యాకూబ్‌నాయక్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.

పుష్పను నిందించలేదు : కలెక్టర్
వేంకటేశ్వర విజ్ఞానమందిరం వద్ద జగజ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన 2008లో వచ్చిందని కలెక్టర్ రామాంజనేయులు చెప్పారు. దీనిపైన విచారణ నిర్వహించి నివేదిక తయారు చేశామని చెప్పారు. నగరంలో అంబేద్కర్ భవన్ ఆధునికీకరణ, జగజ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు విషయాలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అంబేద్కర్ భవనాన్ని రూ.25 లక్షలతో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం స్పీకర్ మీరాకుమార్ స్థాపించిన సమతా మూవ్‌మెంట్ లెటర్‌ప్యాడ్‌మీద న్యాయవాది పుష్ప అధ్యక్షురాలిగా ఉన్నదానిపై ప్రతిపాదన పంపించడం జరిగిందన్నారు. విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతించే కమిటీ పుష్పపేరుమీద అనుమతించిందన్నారు. ఈ నేపధ్యంలో తానుసొంతంగా విగ్రహం ఏర్పాటు చేస్తానని పుష్ప చెప్పారని తెలిపారు. దళితనేతలు అందరూ మాట్లాడినా ఆమె కాదన్నారని చెప్పారు. దళిత సోదరులందరూ ఒకవైపుకు వెళ్లారన్నారు.

ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జిమంత్రి బొత్సా సత్యనారాయణదృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ప్రతిష్టించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ విగ్రహం శిలాఫలకంలో ఆమె పేరు ఉందని, తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాలను ఆమె రికార్డు చేశారని చెబుతున్నారని, ఆ రికార్డుల్లో ఏముందో నాకేం అభ్యంతరం లేదన్నారు. తాను ఆమెను నిందించినట్లు ఎక్కడా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

న్యాయపోరాటం చేస్తా: వైఎస్ పుష్ప
తాను తయూరు చేరుుంచిన విగ్ర హం ఆవిష్కరించాలని ప్రయత్నించి విఫలమైన న్యాయవాది వైఎస్ పుష్ప గాంధీ పార్కు వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహంతో పాటు దీక్ష చేస్తూ మధ్యాహ్నం సొమ్మసిల్లి పడిపోయారు. విగ్రహావిష్కరణ సభ పూర్తి అయిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు తాను తయారు చేసిన విగ్రహం వద్ద కూర్చుని సెలైన్ పెట్టించుకుని మరీ నిరసన వ్యక్తంచేశారు. తనకు వచ్చిన ఆర్డర్‌ను కాదని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మంత్రి వరప్రసాద్, కలెక్టర్ వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బోరున విలపించారు. దీనిపైన తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కన్నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను తయారు చేయించిన విగ్రహానికి నగరంలో తగిన స్థలాన్ని చూపించాలని కోరారు.

Friday, February 4, 2011

పెప్సీ కంపెనీలో ఆకస్మిక తనిఖీ

పెప్సీ కంపెనీలో పనిచేస్తున్న తుమ్మలపాలెం కార్మికులకు న్యాయం జరక్కపోతే కంపెనీని మూసేయించాల్సి వస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. తుమ్మలపాలెంలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు కంపెనీ వ్యవహరిస్తున్న విధానంపై సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కాలంగా కంపెనీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా నాలుగు నెలల క్రితం మేనేజర్ నరశింహరావుపై కార్మికులు దాడి చేశారంటూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.తరువాత కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులు కూడా యాజమాన్యంపై కేసు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపద్యంలో యాజమాన్యం మేనేజర్‌పై దాడిని సీరియస్‌గా తీసుకుని తుమ్మలపాలెం నుంచి కార్మికులను తీసుకోవడానికి నిరాకరించింది. ఈ విషయంలో గతంలో ఎమ్మెల్యే సుచరిత యాజమాన్యంతో మాట్లాడి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నేను అడిగితే పనిలోనికి తీసుకున్నామంటున్నారు, మీరే మో పనికి రానీయడం లేదంటున్నా రు. అసలు విషయమేంటో ఇప్పుడే తేలుస్తానంటూ ఎమ్మెల్యే నేరుగా పెప్సీ కంపెనీకి వెళ్ళింది. హఠాత్తుగా ఎమ్మెల్యేతో పాటు అధికారులు కంపెనీకి రా వడంతో అధికారులు నివ్వెర పోయా రు. అడ్మిన్రిస్టేషన్ అధికారి ప్రసాద్‌ను ఆమె వివరణ అడిగి అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు.అధికారులు చెప్పిన సమాధానం నచ్చని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మేనేజర్‌తోపాటు వైస్ చైర్మన్ మీటింగ్‌కు వైజాగ్ వెళ్ళారని వారు రావడంతోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ ఇక్కడి వారిని పనిలోనికి తీసుకోకపోతే ధర్నా చేసి కంపెనీనీ మూసి వేయించాల్సి వుం టుంది. ఆలోచించుకుని సోమవారం నాటికి నిర్ణయం తీసుకుని తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వణుకూరి శ్రీనివాసరెడ్డి, జడ్‌పీటీసీ మొగిలి భరత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మధుసూధనరెడ్డి, తహసీల్దార్ పీవీ ఎస్ శర్మ, సర్పంచ్ మామాడి ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, February 2, 2011

మద్యం స్మగ్లింగ్ సూత్రదారి ఈ విలేకరి

కాసులకు కక్కుర్తి పడి ఎడా పేడ గుర్తింపు కార్డ్లు జారి చేసిన పోరా సంబంధాల్ శాక అధికారులు తలలు పట్టుకొంతున్నారు.నకిలీ విలేకరుల ఆగడాలు గతంలో ఎక్కువగా వెలుగుచూస్తుండేవి... ప్రస్తుతం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన అక్రిడేటెడ్ జర్నలిస్టులే నేరుగా రంగంలోకి దిగి ఆ ముసుగులో అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయాన్నే అడ్డాగా చేసుకొని అమాయకులను మోసగిస్తున్న సంఘటనలు మరువక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. విదేశీ మద్యం స్మగ్లింగ్ కేసులో మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరి అని తెలుసుకొని కంగు తిన్నారు

. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు మంగళవారం రాత్రే తెలిసినా మీడియా దృష్టికి తీసుకురాలేదు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరైన భద్రశర్మ తాను జర్నలిస్టునని , తన వద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపి ఎక్సైజ్ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించాడు. అతని వద్ద నుంచి ఆ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం దానిపై దర్యాప్తు నిర్వహించి అతను విలేకరేనని నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోయారు. అరండల్‌పేటలో విదేశీ వస్తువులను విక్రయించే దుకాణం నిర్వహించే భద్రశర్మ గత కొన్నేళ్లుగా అక్రమంగా విదేశీ మద్యం అమ్మకాలుకూడా సాగిస్తున్నాడు. తన అక్రమ వ్యాపారం సజావుగా సాగేందుకు విలేకరి ముసుగు దోహదపడుతుందని భావించాడు.

ఏపీఈఎంఎస్ అనే న్యూస్ ఏజన్సీకి పిడుగురాళ్ల విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డు పొందాడు. సమాచార పౌర సంబంధ శాఖ కూడా 2010కి అక్రిడేషన్ కార్డును మంజూరుచేసింది. విదేశీ మద్యాన్ని భధ్రశర్మ చెన్నై నుంచి ఇక్కడకు తీసుకువచ్చి తెలిసిన వ్యక్తుల ద్వారా విక్రయిస్తుంటాడు. ఒక్కో విదేశీ మద్యం సీసా ఖరీదు రూ. 2 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. మంగళవారం పట్టుబడిన మద్యం సీసాల్లో ఏడు, ఎనిమిది వేలు ఖరీదు చేసేవి ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశీ మద్యానికి అలవాటుపడినవారు గుంటూరు

నగరంలో ఎక్కువ కావడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. ఒక్కో బాటిల్ ద్వారా రూ. వెయ్యి వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. చెన్నై నుంచి తెనాలి వరకు రైలు మార్గం ద్వారా తీసుకువచ్చి అక్కడినుంచి కారులో గుంటూరుకు చేరుస్తారు. ఒక్కోసారి ట్రావెల్ ఏజన్సీల ద్వారా కూడా వీటిని తీసుకువస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిీఐ తిరుపతయ్య తాను బ్యాంకు అధికారినని నమ్మించి విలేకరి భధ్రశర్మను, మరో వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు. నాన్ బెయిలబుల్ కేసులో పట్టుబడిన విలేకరి భద్రశర్మను కోర్టుకు హాజరుపరచగా ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు.

అక్రిడేషన్ రద్దుచేస్తాం- డీపీఆర్‌వో
విదేశీ మద్యం కేసులో పట్టుబడిన భద్రశర్మ గుర్తింపుకార్డును రద్దుచేస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి నరసింహారావు తెలిపారు. ఈ సంఘటనపై ఆయన స్పందిస్తూ బుధవారం '' ప్రతినిధితో మాట్లాడుతూ ఆ కార్డు 2010 డిసెంబరు 31 నాటికి ముగిసినా మరో మూడు నెలలు పొడిగించినట్లు చెప్పారు. అయితే భద్రశర్మ గుర్తింపును రద్దుచేసి ఆర్టీసీ అధికారులకు కూడా సమాచారం అందించనున్నట్లు చెప్పారు.

Tuesday, February 1, 2011

కే.చీ.ఆర్. కు సీమాంధ్ర నాయకుల పార్శిల్


సీమాంధ్ర బిర్యాని పేడ అని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు గుంటూరులో విన్నూత్న రీతి లో నిరసన తెలిపారు.
బిర్యాని ఒకసారి తింటే దాని రుచి కేసిీఆర్‌కి తెలుస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గుంటూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్‌కు పార్శిల్ పంపారు. అనంతరం సమైక్యాంధ్ర నేతలకు, మీడియా ప్రతినిధులకు బిర్యాని రుచి చూపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండి హిదాయత్ మాట్లాడుతూ కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర మైనార్టీల సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారన్నారు. తక్షణం కేసి ఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్పీ నాయకులు క్రోసూరి వెంకట్ మాట్లాడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్‌కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ అన్నం మెతుకులు కిందపడితే కళ్లకు అద్దుకొని తింటామని, కేసిీఆర్ దాగుడు మూతలు ఆపాలని కోరారు.

డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు యరమాల విజయ్ కిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు. సీమాంధ్రుల ఓర్పు, సహనం, శాంతిని పరీక్షించవద్దన్నారు. కేసిీఆర్‌ది రాజకీయ డ్రామ అని, పదవుల కోసమే నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా జెట్టి ఝాన్సీ రాణి ఆలపించిన 'రగిలింది తెలుగు తేజం, కదిలింది సమైక్య వాదం' అనే గీతం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ అబ్దుల్ బాసిద్, ఎండి ఇంతియాజ్, కనపర్తి శ్రీనివాసరావు, పి రీయాజ్ ఖాన్, బొట్ల బ్రహ్మం, ఎండి సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ సెంటర్లో దొంగతనం

గుంటూరు నగరంలో జన సమర్థంగా ఉండే మార్కెట్ సెంటర్‌లో దోపిడీ దొంగ బీభత్సం సృష్టించటం సంచలనం రేపింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇరువురు పాత ఇనుము వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేసి రూ. 6.50 లక్షలు ఉన్న రెండు బ్యాగులతో ఉడాయిస్తున్న దోపిడీ దొంగను స్థానికులు వెంటాడిపట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళుతుండగా వారిని నెట్టేసి దొంగ పరారయ్యాడు. దీంతో వారు వెంటాడి మళ్లీ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

ఈ దాడిలో అబ్దుల్ కలాం అనే వ్యాపారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి ప్రాంతానికి చెందిన మౌలాలి, అద్దంకికి చెందిన అబ్దుల్ కలాంలు పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారు. పాత ఇనుము కొనుగోలు చేసి మార్టూరులోని ప్యాక్టరీకి తరలిస్తుంటారు. అయితే విద్యానగర్‌లోని వ్యాపారి వద్ద మంగళవారం రాత్రి మౌలాలి రూ. 3.50 లక్షలు, అబ్దుల్ కలాం రూ. 3 లక్షలు తీసుకొని రెండు వేర్వేరు బ్యాగుల్లో ఆటోలో బయల్దేరారు. మార్కెట్ సెంటర్‌లో దిగి బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే దోపిడీ దొంగ ఒక్కసారిగా వారి కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు పాత కక్షల నేపథ్యంలో దాడి జరుగుతుందని భావించారు.

ఈ దాడిలో అబ్దుల్ కలాం తలకు రెండు చోట్ల బలమైన గాయాలై పడిపోయాడు. అయినప్పటికీ బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో దొంగ బలవంతంగా ఇరువురి వద్ద ఉన్న బ్యాగ్‌లను గుంజుకొని పరారయ్యాడు. దీంతో వ్యాపారులు దొంగ, దొంగ అని కేకలు వేయటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటపడి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నంజుండప్ప, కొత్తపేట రక్షక్ వాహనం, లాలాపేట బ్లూ కోల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కలాంను 108లో జీజీహెచ్‌కు తరలించారు. కాగా ఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తూ దొంగ పడిపోయాడు. దీంతో స్థానికులు ఆటోలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన తరువాత దొంగ ఒక్కసారిగా కానిస్టేబుల్ అంబేద్కర్ (పీసీ 645), రక్షక్ ్రడైవర్ అన్వర్ బాషాలను కట్టేసి దొంగ మళ్ళీ పరారయ్యాడు.

దీంతో వారు పట్నంబజారు బంగారపు కొట్ల వరకు పరిగెత్తి దొంగను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు టీవీ నాగరాజు, డి కోటేశ్వరరావు, సీఐ మధుసూదనరావు తదితరులు స్టేషన్‌కు చేరుకొని పట్టుబడిన దొంగను విచారిస్తున్నారు. తెనాలికి చెందిన రఫీగా గుర్తించినట్లు సమాచారం. గతంలో అతనిపై ఉన్న కేసులు ఇంకా ఏమైనా వెలుగు చూడని నేరాలకు పాల్పడ్డాడా అనేదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గత పది రోజుల క్రితం కూడా మార్కెట్ సెంటర్‌లో కారులో వెళుతున్న వ్యాపారుల సూట్‌కేస్‌ను కూడా ఇదే విధంగా గుంజుకొని పరిగెత్తుతుండగా స్థానికులు వెంటపడి పట్టుకొని దొంగను దేహశుద్ధి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అప్పుడు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

స్థానికుల స్పందనకు ప్రశంసలు
దోపిడీ చేసి పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న స్థానికులు ప్రశంసలు అందుకున్నారు. ఏ మాత్రం భయపడకుండా వారు దొంగను పట్టుకొని అప్పగించటం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇదే విధంగా స్థానికులు తమ వంతుగా సహకరిస్తే నేరాలను అరికట్టటం సులువు అవుతుందని వారు అంటున్నారు. అదేవిధంగా పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్ అంబేద్కర్, ్రడైవర్ అన్వర్ బాషాతో పాటు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సురేష్ (పీసీ 2823), సుభాని (పీసీ 2589)లను అదేవిధంగా సహకరించిన స్థానిక యువకుడు వినోద్‌కుమార్‌లను పోలీసు అధికారులు అభినందించారు.