కాసులకు కక్కుర్తి పడి ఎడా పేడ గుర్తింపు కార్డ్లు జారి చేసిన పోరా సంబంధాల్ శాక అధికారులు తలలు పట్టుకొంతున్నారు.నకిలీ విలేకరుల ఆగడాలు గతంలో ఎక్కువగా వెలుగుచూస్తుండేవి... ప్రస్తుతం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన అక్రిడేటెడ్ జర్నలిస్టులే నేరుగా రంగంలోకి దిగి ఆ ముసుగులో అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయాన్నే అడ్డాగా చేసుకొని అమాయకులను మోసగిస్తున్న సంఘటనలు మరువక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. విదేశీ మద్యం స్మగ్లింగ్ కేసులో మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరి అని తెలుసుకొని కంగు తిన్నారు
. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు మంగళవారం రాత్రే తెలిసినా మీడియా దృష్టికి తీసుకురాలేదు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరైన భద్రశర్మ తాను జర్నలిస్టునని , తన వద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపి ఎక్సైజ్ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించాడు. అతని వద్ద నుంచి ఆ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం దానిపై దర్యాప్తు నిర్వహించి అతను విలేకరేనని నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోయారు. అరండల్‌పేటలో విదేశీ వస్తువులను విక్రయించే దుకాణం నిర్వహించే భద్రశర్మ గత కొన్నేళ్లుగా అక్రమంగా విదేశీ మద్యం అమ్మకాలుకూడా సాగిస్తున్నాడు. తన అక్రమ వ్యాపారం సజావుగా సాగేందుకు విలేకరి ముసుగు దోహదపడుతుందని భావించాడు.
ఏపీఈఎంఎస్ అనే న్యూస్ ఏజన్సీకి పిడుగురాళ్ల విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డు పొందాడు. సమాచార పౌర సంబంధ శాఖ కూడా 2010కి అక్రిడేషన్ కార్డును మంజూరుచేసింది. విదేశీ మద్యాన్ని భధ్రశర్మ చెన్నై నుంచి ఇక్కడకు తీసుకువచ్చి తెలిసిన వ్యక్తుల ద్వారా విక్రయిస్తుంటాడు. ఒక్కో విదేశీ మద్యం సీసా ఖరీదు రూ. 2 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. మంగళవారం పట్టుబడిన మద్యం సీసాల్లో ఏడు, ఎనిమిది వేలు ఖరీదు చేసేవి ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశీ మద్యానికి అలవాటుపడినవారు గుంటూరు
నగరంలో ఎక్కువ కావడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. ఒక్కో బాటిల్ ద్వారా రూ. వెయ్యి వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. చెన్నై నుంచి తెనాలి వరకు రైలు మార్గం ద్వారా తీసుకువచ్చి అక్కడినుంచి కారులో గుంటూరుకు చేరుస్తారు. ఒక్కోసారి ట్రావెల్ ఏజన్సీల ద్వారా కూడా వీటిని తీసుకువస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిీఐ తిరుపతయ్య తాను బ్యాంకు అధికారినని నమ్మించి విలేకరి భధ్రశర్మను, మరో వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు. నాన్ బెయిలబుల్ కేసులో పట్టుబడిన విలేకరి భద్రశర్మను కోర్టుకు హాజరుపరచగా ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు.
అక్రిడేషన్ రద్దుచేస్తాం- డీపీఆర్‌వో
విదేశీ మద్యం కేసులో పట్టుబడిన భద్రశర్మ గుర్తింపుకార్డును రద్దుచేస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి నరసింహారావు తెలిపారు. ఈ సంఘటనపై ఆయన స్పందిస్తూ బుధవారం '' ప్రతినిధితో మాట్లాడుతూ ఆ కార్డు 2010 డిసెంబరు 31 నాటికి ముగిసినా మరో మూడు నెలలు పొడిగించినట్లు చెప్పారు. అయితే భద్రశర్మ గుర్తింపును రద్దుచేసి ఆర్టీసీ అధికారులకు కూడా సమాచారం అందించనున్నట్లు చెప్పారు.
Total Pageviews
Wednesday, February 2, 2011
మద్యం స్మగ్లింగ్ సూత్రదారి ఈ విలేకరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment