Total Pageviews
Sunday, February 6, 2011
దళితుల వివాదం విగ్రహం తో నిరసన
వివాదాలు.. దీక్షలు.. రాజకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు గుంటూరు నగరం నడిబొడ్డున బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం నెలకొల్పారు. నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరం కూడలిలో ఆదివారం జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి దళిత నేతలతో కలసి ర్యాలీగా తరలివచ్చారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మహ్మద్‌జానీ, ఎంపీ రాయపాటి సాంబశివరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వివాదాలు సరికాదు..
విగ్రహావిష్కరణ అనంతరం విజ్ఞానమందిరం ఎదుట ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నగరంలో విగ్రహం ఏర్పాటు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదాలు మంచివి కావని హితవు పలికారు. కార్యక్రమ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సీనియర్ మంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, విగ్రహం ఏర్పాటు అందరం కలిసి కట్టుగా చేసుకున్న కార్యక్రమమని తెలిపారు. సభలో మహ్మద్‌జానీ ప్రసంగిస్తూ అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఎంపీ రాయపాటి మాట్లాడుతూ బీహార్‌లో ఆయన తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జగ్జీవన్‌రామ్ తదనంతరం ఆ రాష్ట్రంలో పార్టీ బాగా దెబ్బతిందన్నారు.
దళితులను ప్రేమించే నాయకులు కావాలి..
నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విగ్రహాలు మినహా మరో నాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయడం లేదని, అటువంటి తరుణంలో జగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. దళితులను ప్రేమించే నాయకులు, అధికారులు రావాలని అభిలషించారు. జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాలకు మార్గద ర్శకంగా నిలిచారని సభాధ్యక్షుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మస్తాన్‌వలి కొనియూడారు. సభలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, కేఎస్ లక్ష్మణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, జేసీ శరత్, అదనపు జేసీ యాకూబ్‌నాయక్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
పుష్పను నిందించలేదు : కలెక్టర్
వేంకటేశ్వర విజ్ఞానమందిరం వద్ద జగజ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన 2008లో వచ్చిందని కలెక్టర్ రామాంజనేయులు చెప్పారు. దీనిపైన విచారణ నిర్వహించి నివేదిక తయారు చేశామని చెప్పారు. నగరంలో అంబేద్కర్ భవన్ ఆధునికీకరణ, జగజ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు విషయాలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అంబేద్కర్ భవనాన్ని రూ.25 లక్షలతో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం స్పీకర్ మీరాకుమార్ స్థాపించిన సమతా మూవ్‌మెంట్ లెటర్‌ప్యాడ్‌మీద న్యాయవాది పుష్ప అధ్యక్షురాలిగా ఉన్నదానిపై ప్రతిపాదన పంపించడం జరిగిందన్నారు. విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతించే కమిటీ పుష్పపేరుమీద అనుమతించిందన్నారు. ఈ నేపధ్యంలో తానుసొంతంగా విగ్రహం ఏర్పాటు చేస్తానని పుష్ప చెప్పారని తెలిపారు. దళితనేతలు అందరూ మాట్లాడినా ఆమె కాదన్నారని చెప్పారు. దళిత సోదరులందరూ ఒకవైపుకు వెళ్లారన్నారు.
ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జిమంత్రి బొత్సా సత్యనారాయణదృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ప్రతిష్టించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ విగ్రహం శిలాఫలకంలో ఆమె పేరు ఉందని, తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాలను ఆమె రికార్డు చేశారని చెబుతున్నారని, ఆ రికార్డుల్లో ఏముందో నాకేం అభ్యంతరం లేదన్నారు. తాను ఆమెను నిందించినట్లు ఎక్కడా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
న్యాయపోరాటం చేస్తా: వైఎస్ పుష్ప
తాను తయూరు చేరుుంచిన విగ్ర హం ఆవిష్కరించాలని ప్రయత్నించి విఫలమైన న్యాయవాది వైఎస్ పుష్ప గాంధీ పార్కు వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహంతో పాటు దీక్ష చేస్తూ మధ్యాహ్నం సొమ్మసిల్లి పడిపోయారు. విగ్రహావిష్కరణ సభ పూర్తి అయిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు తాను తయారు చేసిన విగ్రహం వద్ద కూర్చుని సెలైన్ పెట్టించుకుని మరీ నిరసన వ్యక్తంచేశారు. తనకు వచ్చిన ఆర్డర్‌ను కాదని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మంత్రి వరప్రసాద్, కలెక్టర్ వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బోరున విలపించారు. దీనిపైన తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కన్నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను తయారు చేయించిన విగ్రహానికి నగరంలో తగిన స్థలాన్ని చూపించాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment