Total Pageviews

Friday, February 4, 2011

పెప్సీ కంపెనీలో ఆకస్మిక తనిఖీ

పెప్సీ కంపెనీలో పనిచేస్తున్న తుమ్మలపాలెం కార్మికులకు న్యాయం జరక్కపోతే కంపెనీని మూసేయించాల్సి వస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. తుమ్మలపాలెంలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు కంపెనీ వ్యవహరిస్తున్న విధానంపై సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కాలంగా కంపెనీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా నాలుగు నెలల క్రితం మేనేజర్ నరశింహరావుపై కార్మికులు దాడి చేశారంటూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.తరువాత కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులు కూడా యాజమాన్యంపై కేసు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపద్యంలో యాజమాన్యం మేనేజర్‌పై దాడిని సీరియస్‌గా తీసుకుని తుమ్మలపాలెం నుంచి కార్మికులను తీసుకోవడానికి నిరాకరించింది. ఈ విషయంలో గతంలో ఎమ్మెల్యే సుచరిత యాజమాన్యంతో మాట్లాడి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నేను అడిగితే పనిలోనికి తీసుకున్నామంటున్నారు, మీరే మో పనికి రానీయడం లేదంటున్నా రు. అసలు విషయమేంటో ఇప్పుడే తేలుస్తానంటూ ఎమ్మెల్యే నేరుగా పెప్సీ కంపెనీకి వెళ్ళింది. హఠాత్తుగా ఎమ్మెల్యేతో పాటు అధికారులు కంపెనీకి రా వడంతో అధికారులు నివ్వెర పోయా రు. అడ్మిన్రిస్టేషన్ అధికారి ప్రసాద్‌ను ఆమె వివరణ అడిగి అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు.అధికారులు చెప్పిన సమాధానం నచ్చని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మేనేజర్‌తోపాటు వైస్ చైర్మన్ మీటింగ్‌కు వైజాగ్ వెళ్ళారని వారు రావడంతోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ ఇక్కడి వారిని పనిలోనికి తీసుకోకపోతే ధర్నా చేసి కంపెనీనీ మూసి వేయించాల్సి వుం టుంది. ఆలోచించుకుని సోమవారం నాటికి నిర్ణయం తీసుకుని తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వణుకూరి శ్రీనివాసరెడ్డి, జడ్‌పీటీసీ మొగిలి భరత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మధుసూధనరెడ్డి, తహసీల్దార్ పీవీ ఎస్ శర్మ, సర్పంచ్ మామాడి ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment