Total Pageviews

Tuesday, February 1, 2011

కే.చీ.ఆర్. కు సీమాంధ్ర నాయకుల పార్శిల్


సీమాంధ్ర బిర్యాని పేడ అని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు గుంటూరులో విన్నూత్న రీతి లో నిరసన తెలిపారు.
బిర్యాని ఒకసారి తింటే దాని రుచి కేసిీఆర్‌కి తెలుస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గుంటూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్‌కు పార్శిల్ పంపారు. అనంతరం సమైక్యాంధ్ర నేతలకు, మీడియా ప్రతినిధులకు బిర్యాని రుచి చూపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండి హిదాయత్ మాట్లాడుతూ కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర మైనార్టీల సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారన్నారు. తక్షణం కేసి ఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్పీ నాయకులు క్రోసూరి వెంకట్ మాట్లాడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్‌కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ అన్నం మెతుకులు కిందపడితే కళ్లకు అద్దుకొని తింటామని, కేసిీఆర్ దాగుడు మూతలు ఆపాలని కోరారు.

డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు యరమాల విజయ్ కిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు. సీమాంధ్రుల ఓర్పు, సహనం, శాంతిని పరీక్షించవద్దన్నారు. కేసిీఆర్‌ది రాజకీయ డ్రామ అని, పదవుల కోసమే నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా జెట్టి ఝాన్సీ రాణి ఆలపించిన 'రగిలింది తెలుగు తేజం, కదిలింది సమైక్య వాదం' అనే గీతం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ అబ్దుల్ బాసిద్, ఎండి ఇంతియాజ్, కనపర్తి శ్రీనివాసరావు, పి రీయాజ్ ఖాన్, బొట్ల బ్రహ్మం, ఎండి సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment