జిల్లా లోని కళాశాలలో కుల పిచ్చి raajyameluthundi.vidhyardhulu chaduvulu maani kula raajakeeyalo munigi theluthunnaru.ee nepadyamlo tarachuu brundaaluga veedi garshnalu paduthunnaru. గుంటూరులోని శ్యామలానగర్ రైల్వేగేటు, నల్లపాడు రైలుమార్గం మధ్యలో పట్టాలపై బిటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా చంపి పట్టాలపై వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరో పది రోజుల్లో మృతుడి చెల్లి వివాహం జరగనుంది. కార్డులు పంచేందుకు వచ్చి మృత్యువాతపడ్డాడు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి.
ఈ సంఘటకు సంబంధించిన వివరాలను జీఆర్‌పి ఎస్ఐ జులకర్‌నైన్ విలేకరులకు వెల్లడించారు. వసంతరాయపురం 8వ లైనుకు చెందిన రవిబాబు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ వద్ద కారు ్రడైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్దకుమారుడు కె ఫణికోటేశ్వరరావు (19) వింజనంపాడులోని ్రపైవేట్ కాలేజిలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆమెకు చెల్లి షర్మిల. ఇదిలా ఉంటే చెల్లి వివాహం ఈ నెలలో జరగనుంది.
ఎప్పటివలె ఫణికోటేశ్వరరావు కాలేజికి వెళ్లి మధ్యాహ్నం వాంతులు కావడంతో తల్లికి ఫోన్ చేసి గుంటూరు బయలుదేరాడు. సాయంత్రానికి ఇంటికి చేరి, చెల్లి పెళ్లికావడంతో కార్డులు పంచేందుకు బయటికివచ్చాడు. తెల్లవారేసరికి కోటేశ్వరరావు రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
ఫోన్ చేసి మృతుడిని అక్కడికి పిలిపించి హతమార్చి ఉంటారని, అనంతరం కేసు నుంచి తప్పించుకునే క్రమంలో మృతదేహాన్ని పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతుడు ఉపయోగించిన సెల్‌ఫోన్ కనిపించలేదు. అక్కడ ఉన్న ద్విచక్రవాహనం ఇంజన్ నంబరు ఆధారంగా మృతుని వివరాలు ఎస్ఐ కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆగిపోయిన చెల్లి వివాహం ఫణికోటేశ్వరరావు అకాల మృతితో చెల్లెలి వివాహం వాయిదా పడింది. వివాహవేడుకలకు రావాల్సిన బంధువులు ఈ వార్త విని ద్రిగ్భాంతికి గురయ్యారు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు అలముకున్నాయి.
No comments:
Post a Comment