
తెనాలి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి లభించనుంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకరైనా కొంతకాలంగా స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు స్పీకర్ బాధ్యతలు నిర్వహించిన కిరణ్‌కుమార్ రెడ్డి సిీఎం కావడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మనోహర్ స్పీకర్‌గా విధులునిర్వర్తిస్తూ వచ్చారు.
మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి కల్పించనప్పటికీ ఆ బాధ్యతలను వివాద రహితంగా, సమర్థవంతంగా నిర్వర్తిస్తుండటంతో ఆయననే స్పీకర్‌గా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు, మూ డు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన మనోహర్‌కు వైఎస్ఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్ పద వి లభించింది.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడుగానే కాకుండా తన పనితీరుతో కూడా మనోహర్ అధిష్టానం వద్ద గుర్తింపు పొందారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో మనోహర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండో పర్యాయం తెనాలి టిక్కెట్‌ను మనోహర్‌కు ఇప్పించే విషయంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా నియామకం కాకముందు పీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో క్రియాశీలక పాత్ర పోషించారు.
No comments:
Post a Comment