Total Pageviews

Tuesday, November 29, 2011

raitu kanta kanniru migilche rabi

రబీ పంటల సాగుపై రైతుల్లో ఉన్న ఉత్కంఠ నేడు వీడనుంది. రబీకి సాగునీటి సరఫరాకు అవకాశం లేదని ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో తేల్చటంతో రైతుల్లో ఆందోళన నెలకొనటం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఆందోళన చేపట్టటం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటిని సాధించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించటం రైతుల్లో ఆశను రేకెత్తించింది. రబీ సీజనుకు పంట విరామానికి నిర్ణయిస్తూ కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ జిల్లాలో సాగునీటి సరఫరా ఉంటుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇన్ని సందేహాల నడుమ జిల్లా ఐఏబీ సమావేశం మంగళవారం ఏర్పాటుకానుంది. ఇందులో చేసే తీర్మానంతోనే ఇన్నిరోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడనుంది.

నాగార్జునసాగర్, కృష్ణాపశ్చిమడెల్టా పరిధిలోని ఆయకట్టులో రబీ సీజనులో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తుంటారు. పశ్చిమడెల్టా కిందకు వచ్చే తెనాలి డివిజనులో వరి తర్వాత మొక్కజొన్న సాగు విస్తారంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. మరో 30 వేల ఎకరాల్లో వరి వేస్తుంటారు. ధాన్యానికి ‘మద్దతు’ తక్కువగా ఉండటం, ఎరువుల ధరలు పెరగటంతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు ఏమాత్రం గిట్టుబాటుకాని పరిస్థితిలో మొక్కజొన్న ఒక్కటే రైతులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. చిన్న సన్నకారు రైతుల ఎకరాకు రూ.20-25 వేల వరకు కౌలుకు తీసుకుని మరీ సాగుచేస్తుంటారు. ఖరీఫ్‌లో సగటు దిగుబడులు సంతృప్తికరంగా ఉండేలా కనిపిస్తున్నా ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. అందుకే మొక్కజొన్నకు సన్నాహాలు చేస్తున్నారు. కోత కోసి కుప్ప వేసిన చేలల్లో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే మొక్కజొన్నను విత్తుతున్నారు. మిగిలిన రైతులు సాగునీటి సరఫరా నిర్ణయంకోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు ఐఏబీ సమావేశంలో పంట విరామం తీర్మానం అనివార్యమైతే మొక్కజొన్న రాబడిని రైతులు వదులుకోవాల్సిందే. డివిజనులోని రైతులు హీనపక్షం రూ.1000-1200 కోట్ల పంటను కోల్పోయినట్టు కాగలదు.

అదను దాటిన పంటలు..
సాగర్ ఆయకట్టు విషయానికొస్తే, రబీలో ఎక్కువగా మిర్చి పంటకు సాగునీటి అవసరం ఉంది. ఏటా ఆగస్టు/ సెప్టెంబరులో వేసే మిర్చిని వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్నిచోట్ల అక్టోబరు/నవంబరులోనూ వేయాల్సివచ్చింది. మొత్తం 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. జనవరి-ఏప్రిల్ నెలల్లో మిర్చి కోతకొస్తుంది. కాయ ఊరే సమయంలో సాగునీటి అవసరం ఎంతగానో ఉంటుంది. పంట విరామం నిర్ణయమైతే కాలువనీటిపై ఆధారపడిన లక్ష ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింటుంది. ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే కనీసం పది క్వింటాళ్ల దిగుబడి పడిపోతుందని రైతుసంఘం జిల్లా నాయకుడు రాధాకృష్ణ చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించుకుంటే కేవలం మిర్చి పంటతోనే రైతులు రూ.300-400 కోట్ల వరకు నష్టపోతారని చెప్పారు. సాగర్ ఆయకట్టులో ప్రధానంగా మిర్చి పంటను నష్టపోవాల్సి ఉంటుంది. మరో 20 వేల ఎకరాల్లో వేసే వరిపంటకు నూకలు చెల్లిపోతాయి.

పనిదినాలను కోల్పోతున్న కూలీలు..
పంటనష్టానికి తోడు వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరిలో కోత యంత్రాలు వచ్చాక కూలీలకు పనిదినాలు తక్కువయ్యాయి. మొక్కజొన్న, మిర్చికి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. మొక్కజొన్నలో ఎకరాకు కనీసం 50, మిర్చికి 200-250 పనిదినాలు అనివార్యంగా ఉంటాయి. రబీకి నీరివ్వకపోతే రెండు పైర్లకు కలిపి దాదాపు 1.75 కోట్ల పనిదినాలను కోల్పోవాల్సి వస్తుంది. అటు రైతులకు రాబడి లేకుండా, కూలీలు ఉపాధిని కోల్పోతే ఆ ప్రభావం జిల్లా ఆర్థికపరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వేరే చెప్పనవసరం లేదు. కేవలం కాలువల ఆధునికీకరణ కోసమని పంట విరామం ప్రకటించాల్సిన అవసరం లేదని రైతులు, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం. రబీ తర్వాత ఎన్ని నెలలు విరామం వస్తే అంతవరకు చేయగలిగిన పనులు చేస్తే చాలంటున్నారు. ఆధునిక యంత్రాలు వచ్చినందున రెండు నెలల్లో చేసే పనిని నెల వ్యవధిలో చేపట్టే అవకాశముందని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ పంట విరామం ప్రకటించి అవకాశం కల్పించినా, మూడేళ్లుగా బద్ధకం వదుల్చుకోని కాంట్రాక్టు సంస్థలు ఇప్పుడు వేగంగా స్పందించి పనిచేస్తాయన్న గ్యారెంటీ ఏముందనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి.
కాని  nedu జరిగిన సమావేశం లో ప్రతిపక్ష నాయకులూ , రైతులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కలెక్టర్  సమావేశం మధ్యలోనుచి అర్ధ్హతరంగ వెళ్ళిపోవడం పలు విమరలలకు తావుఇచ్చింది. తెలుగుదేశం నాయకులు కల్లెరచ్తే ని ముట్టడించి హడావిడి చేసారు.



Saturday, June 11, 2011

'విరాళాల' పార్టీలు!



భారీగా పుట్టుకొస్తున్న కొత్త పార్టీలు
పన్ను మినహాయింపుతో సమస్యలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
నగలు కూడా కొన్న ఘనులు
 రాజకీయ పార్టీలకు, పన్ను మినహాయింపులకు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఏమైనా సంబంధం ఉందా? పైకి చూస్తే... ఏమీలేనట్లే కనిపిస్తుంది. కానీ, వీటన్నింటి మధ్య ఆసక్తికరమైన 'సంబంధం' ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలను ఆదాయపు పన్ను నుంచి మినహాయించడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. పన్ను మినహాయింపు ప్రకటించిన తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త పార్టీలు పుడుతున్నాయి.విరాళాల పేరిట పొందిన డబ్బులను స్టాక్ మార్కెట్‌లో పెట్టినఉదంతాలున్నాయి, నగలు కొన్నవారూ ఉన్నర్రు. చెప్పారు."ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టరైన పార్టీల సంఖ్య 1200 వరకు చేరుకుంది. ఇందులో 75 నుంచి 80 శాతం పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడమే లేదు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి ఆదాయపు పన్ను మినహాయించడంతో భారీ స్థాయిలో కొత్త పార్టీలు పుడుతున్నాయి.ఒక పార్టీ చిరునామాకు వెళ్లగా... అక్కడ టీ కొట్టు కనిపించింది. ఒక పార్టీకి అందిన విరాళాలతో నగలు కొన్నట్లు తేలింది. కొందరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కూడా పెట్టారు. అందుకే... ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఈసీకి ఉండాలి'' 
దీనికి సంబంధించి ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే పార్టీలకు అందే విరాళాలపై మాత్రమే పన్ను మినహాయింపు ఉండాలన్నారు. పార్టీల ఖాతాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, కాగ్ లేదా ఈసీ నియమించే ఆడిటర్ల చేత ఖాతాలను పరిశీలించే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. "చాలా పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్స్‌కూడా సమర్పించడంలేదు. ఇలాంటి పార్టీల వివరాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును కోరుతున్నారు.
గుంటూరు జిల్లా లో కూడా కేవలం గోడలమీద మాత్రమే కనిపించే పార్టీలు పదుల సంఖ్యలో వెలిసాయి. వీరిలో కొందరు తమ సామాజికవర్గానికి చెందిన ధనవంతులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా విరాళాలు దండుకొంటున్నారు. tadvara  న్యాయంగా ప్రభుత్వానికి చేరాల్సిన పన్నులను ఎగవీయడానికి రాజమార్గం రూపొందించారు. దళితులకు, బహుజన, పీడిత ప్రజల పక్షాన నిలుస్తామని పేరు పెట్టుకొన్న ఒక పార్టీ నాయకుడు ఈవిధమైన సంపాదనలో కోట్లు  గడించినట్లు సమాచారం. 
 అందుకే... ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఈసీకి ఉండాలి'' అని ప్రజలు కూరుకొంతున్నారు.

Monday, May 23, 2011

అన్నం పెట్టె రైతుకు మన్ను పెట్టిన ప్రభుత్వం


 'అందరికీ ఆహారo!'.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆహార బద్రత  చట్టం అందరికీ అన్నంపెట్టే రైతుకే శాపంగా మారిందా? వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ప్రస్తుతం మార్కెట్‌లో అన్నదాత పండించిన ధాన్యానికి మద్దతు ధర పలకక పోవడానికి, కొనుగోళ్లు ముందుకు సాగకపోవడానికీ.. కేంద్ర ప్రభుత్వం త్వరలో తేనున్న ఆహార భద్రత చట్టానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది! ఈ నిజాన్ని అంగీకరించేందుకు సాహసించని ప్రభుత్వం, నాయకులు, మిల్లర్లు... అంతా కలిసి రైతులతో ఆడుకుంటున్నారు. వారిని ఒక విష వలయంలోకి నెట్టేశారు. చట్టం చట్రంలో బంధించారు.

దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో సుమారు 6 వేల రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో నాలుగు వేల మంది ధాన్యం సేకరణ చేపడతారు. ఇదో శక్తిమంతమైన లాబీ! రాష్ట్రంలో లెవీ బాధ్యతను ప్రభుత్వం మిల్లర్లపైనే పెట్టింది. ఇప్పుడు.. రబీలో పండిన ధాన్యం కొనుగోళ్లు మందగించడానికి మిల్లర్లే కారణమయ్యారు. 'ధాన్యం ఎందుకు కొనరు?' అని ప్రశ్నిస్తే... 'ఇప్పటికే కొన్న ధాన్యం మా వద్ద మూల్గుతోంది. కొత్తగా ఎందుకు కొనాలి? ఎలా కొనాలి?' అనే వాదన వినిపిస్తున్నారు.

'మా దగ్గర ఉన్న బియ్యం ఎగుమతికి అనుమతిస్తే, మీ దగ్గరున్న ధాన్యం కొంటాం' అని మెలిక పెడుతున్నారు. 2008 వరకు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నారు. బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో స్థానిక మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. దీంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. మన బియ్యానికి విదేశాలలో భారీ డిమాండ్ ఉంది. ప్రధానంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన లక్షల మంది భారతీయులు మన బియ్యాన్నే తెప్పించుకుంటారు. ఇప్పుడు ఎగుమతులకు గేట్లు ఎత్తితే మిల్లర్లకు కాసుల వర్షం కురవడం ఖాయం!

అదేసమయంలో... ధాన్యం ధరలు కూడా పెరిగే అవకాశముంది. కానీ, బియ్యం ఎగుమతులకు కేంద్రం ససేమిరా అంటోంది. ఆహార మంత్రి శరద్ పవార్ నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరిదీ అదే మాట! వచ్చే వర్షాకాల సమావేశంలో కేంద్రం ఆహార భద్రత చట్టాన్ని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి కుటుంబానికి తెల్లకార్డుపై 35 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ఆ మేరకు బియ్యాన్ని నిల్వ చేయకపోతే... చట్టం చట్టుబండలవుతుంది. ఎగుమతులకు అనుమతిస్తే స్థానిక మార్కెట్‌లో ధరలు భగ్గుమంటాయి. ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్రం బియ్యం ఎగుమతులకు ససేమిరా అంటోంది.

అన్నీ కొర్రీలే...
బియ్యం ఎగుమతులకు కేంద్రం అంగీకరించకపోవడంతో... మిల్లర్లు ఆ కోపాన్ని రైతులపై చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. రబీలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి లెక్కలు చూపించి మాయాజాలం చేస్తున్నారు. కనీస మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ధాన్యం సేకరణపై పర్యవేక్షణకు నియమించిన సీనియర్ ఐఏఎస్‌లు వచ్చినప్పుడు మాత్రం మిల్లర్లు హడావుడి చేస్తున్నారు. అప్పుడైనా సక్రమంగా కొంటున్నారా అంటే అదీ లేదు. తేమ శాతం అధికంగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారు. ర్యాకులు లేవని, గోనె సంచుల కొరత ఉందని రకరకాల సమస్యలు తెరపైకి తెస్తున్నారు.

ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు వెయ్యి, 'ఎ' గ్రేడ్‌కు 1030 రూపాయల వంతున మద్దతు ధర నిర్ణయించినా... ఇది ఎక్కడా అమలు కావడంలేదు. మిల్లర్లు 800 నుంచి రూ.850లకు మించి చెల్లించడంలేదు. రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని చెబుతున్నప్పటికీ ఇప్పటికి కేవలం 33 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగసంస్థలైన పౌరసరఫరాల కార్పొరేషన్, ఐకేపీ, ఎఫ్‌సీఐ కలిపి ఎనిమిది లక్షల టన్నులు కొనగా, మిల్లర్లు 25 లక్షల టన్నులు కొన్నారు.

Thursday, May 12, 2011

engeneering vidhyardhi anumanaspada mruti

జిల్లా లోని కళాశాలలో కుల పిచ్చి raajyameluthundi.vidhyardhulu chaduvulu maani kula raajakeeyalo munigi theluthunnaru.ee nepadyamlo tarachuu brundaaluga veedi garshnalu paduthunnaru.  గుంటూరులోని శ్యామలానగర్ రైల్వేగేటు, నల్లపాడు రైలుమార్గం మధ్యలో పట్టాలపై బిటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా చంపి పట్టాలపై వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరో పది రోజుల్లో మృతుడి చెల్లి వివాహం జరగనుంది. కార్డులు పంచేందుకు వచ్చి మృత్యువాతపడ్డాడు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి.

ఈ సంఘటకు సంబంధించిన వివరాలను జీఆర్‌పి ఎస్ఐ జులకర్‌నైన్ విలేకరులకు వెల్లడించారు. వసంతరాయపురం 8వ లైనుకు చెందిన రవిబాబు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ వద్ద కారు ్రడైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్దకుమారుడు కె ఫణికోటేశ్వరరావు (19) వింజనంపాడులోని ్రపైవేట్ కాలేజిలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆమెకు చెల్లి షర్మిల. ఇదిలా ఉంటే చెల్లి వివాహం ఈ నెలలో జరగనుంది.

ఎప్పటివలె ఫణికోటేశ్వరరావు కాలేజికి వెళ్లి మధ్యాహ్నం వాంతులు కావడంతో తల్లికి ఫోన్ చేసి గుంటూరు బయలుదేరాడు. సాయంత్రానికి ఇంటికి చేరి, చెల్లి పెళ్లికావడంతో కార్డులు పంచేందుకు బయటికివచ్చాడు. తెల్లవారేసరికి కోటేశ్వరరావు రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

ఫోన్ చేసి మృతుడిని అక్కడికి పిలిపించి హతమార్చి ఉంటారని, అనంతరం కేసు నుంచి తప్పించుకునే క్రమంలో మృతదేహాన్ని పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతుడు ఉపయోగించిన సెల్‌ఫోన్ కనిపించలేదు. అక్కడ ఉన్న ద్విచక్రవాహనం ఇంజన్ నంబరు ఆధారంగా మృతుని వివరాలు ఎస్ఐ కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆగిపోయిన చెల్లి వివాహం ఫణికోటేశ్వరరావు అకాల మృతితో చెల్లెలి వివాహం వాయిదా పడింది. వివాహవేడుకలకు రావాల్సిన బంధువులు ఈ వార్త విని ద్రిగ్భాంతికి గురయ్యారు. దీంతో కుటుంబంలో విషాధ చాయలు అలముకున్నాయి.

Sunday, May 8, 2011

కొత్త పదవి


తెనాలి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి లభించనుంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకరైనా కొంతకాలంగా స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు స్పీకర్ బాధ్యతలు నిర్వహించిన కిరణ్‌కుమార్ రెడ్డి సిీఎం కావడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మనోహర్ స్పీకర్‌గా విధులునిర్వర్తిస్తూ వచ్చారు.

మనోహర్‌కు స్పీకర్‌గా పదోన్నతి కల్పించనప్పటికీ ఆ బాధ్యతలను వివాద రహితంగా, సమర్థవంతంగా నిర్వర్తిస్తుండటంతో ఆయననే స్పీకర్‌గా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు, మూ డు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన మనోహర్‌కు వైఎస్ఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్ పద వి లభించింది.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడుగానే కాకుండా తన పనితీరుతో కూడా మనోహర్ అధిష్టానం వద్ద గుర్తింపు పొందారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో మనోహర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండో పర్యాయం తెనాలి టిక్కెట్‌ను మనోహర్‌కు ఇప్పించే విషయంలో శ్రీనివాస్ పాత్ర కూడా ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా నియామకం కాకముందు పీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ప్రేమ త్రికోణం

స్నేహితురాలికి ఇష్టం లేని పెళ్లి చేశా రు.. దీనిని తట్టుకోలేని నవ వధువు, ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు య త్నించిన ఘటన శనివారం తక్కెళ్ళపాడు సమీపంలో జరి గింది. భీమవరానికి చెందిన డి లావ ణ్య, తెనాలికి చెందిన ఎం సుజన గుం టూరులోని సిమ్స్ కాలేజీలో బీపీటీ కోర్సు చదువుతున్నారు. ఒకరు నాలు గో సంవత్సరం కాగా, మరొకరు ఐదో సంవత్సరం కోర్సు చేస్తున్నారు.

తాపీ మేస్త్రిగా పని చేసే తాడేపల్లికి చెందిన ఇస్కేపల్లి దిలీప్ అనే యువకుడు సుజనకు పిన్ని కొడుకు అవుతాడు. లావణ్య, సుజనలు సిమ్స్ కాలేజీలో ఒకే గదిలో ఉంటూ చదువుకుంటు న్నారు. దిలీప్ వారికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇస్తుంటాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారి ముగ్గురి మధ్య శారీరిక సంబంధం ఏర్పడినిది.

ఈ నేపథ్యంలో ఈ నెల 5న సుజనకు వివాహం జరిగింది. అయితే సుజనకు ఇష్టంలేని పెళ్లి జరిగిందని ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని తక్కెళ్ళపాడు సమీపంలోని గుంటూరు చానల్ వద్ద ఉన్న మొక్కజొన్న పొలానికి ద్విచక్ర వాహనంపై శనివారం వచ్చారు. అక్కడి గడ్డిమందు తాగారు. వీరిని గమనించిన కూలీల సమాచారంతో 108 సి బ్బంది ముగ్గురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లావణ్య, సుజనల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ్రపైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నో అనుమానాలు... లావణ్య, సుజన, దిలీప్‌ల ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇష్టంలేని వివాహం జరిగితే సుజన ఒక్కతే ఆత్మహత్య చేసుకోవాలి కాని మిగిలిన ఇద్దరు ఎందు కు ఆత్మహత్యకు యత్నించారనేది ఎవరి కీ అర్థం కావడం లేదు. శుక్రవారం లగేజీతో ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య శనివారం మధ్యాహ్నం వర కు ఎక్కడ ఉన్నాదో తెలియాల్సి ఉంది. పొలంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురి మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. వారి మధ్య ఘర్షణ కారణాలేంటో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మీడియాపై ఆగ్రహం ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురి ఉదంతం తెలిసి జీజీహెచ్‌కు వెళ్లిన మీ డియాపై ప్రతిని««ధులపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీటీ విద్యార్థినుల ఆత్మహత్యాయత్యం విషయా న్ని గోప్యంగా ఉంచాలని వైద్యులు ప్రయత్నించారు. ఫొటోలు, వీడియో తీస్తుం డగా వైద్యులు అడ్డుకున్నారు. దీంతో మీడియా, వైద్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.

స్థానిక పోలీసులు కూడా తమకు పట్టీపట్టనట్టుగా వ్యవహరించారు. ఎంఎల్‌సి కేసు నమోదు చేయకుండానే క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి పంపించివేశారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు సూపరింటెండెంట్ ఫణిభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.

Saturday, April 30, 2011

అగ్ర కులం అగచాట్లు



దేవుడా ఏమిటీ దుస్థితి!
వెనకబడిన బ్రాహ్మణులు..
దారిద్య్ర రేఖకు దిగువన 55 శాతం మంది

నెలకు వారి తలసరి ఆదాయం రూ.650 లోపే
బిడ్డలను చదివించుకోలేని దుస్థితి
పది, ఇంటర్‌తోనే చదువులకు స్వస్తి
రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్‌లకు దూరం
నెలకు రూ. 500తో జీవించే కుటుంబాలెన్నో
బ్రాహ్మణుల దుస్థితిపై జె. రాధాకృష్ణ సర్వే

హైదరాబాద్, ఏప్రిల్ 30 : 'లోకాఃసమస్తాం సుఖినోభవంతు' అంటూ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలి అని కోరుకునే బ్రాహ్మణులు ఇప్పుడు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు అన్ని వర్గాలకూ మార్గనిర్దేశకులు ఇప్పుడు దారీతెన్నూ కనిపించక అలమటిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించే గురువులుగా కీర్తిగడించిన వారు ఇప్పుడు తమ బిడ్డలను చదివించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంచికీ చెడుకీ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్రహ్మ స్వరూపులుగా పిలిచే బ్రాహ్మణుల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు కడు దయనీయంగా మారింది.

రాష్ట్రంలో 55 శాతం మంది బ్రాహ్మణులు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. నెలకు వారి తలసరి ఆదాయం కూడా రూ.650లోపే! ఇక, బ్రాహ్మణుల్లో నిరుద్యోగుల శాతం (75 శాతం) అన్ని వర్గాల కంటే ఎక్కువ. తమ బిడ్డలను వారు ఇంటర్మీడియట్‌కు మించి చదివించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు ఇప్పుడు కుల వృత్తితోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. బ్రాహ్మణుల దుస్థితిపై జే.రాధాకృష్ణ దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఆ వివరాలతో 'బ్రాహ్మిన్స్ ఆఫ్ ఇండియా' పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించారు. ఛుగ్ పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలోని అర్చకులంతా దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. ప్రస్తుత వ్యవస్థలో వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్లు, ఆర్థిక ప్రతిబంధకాలు కలగలిసి తమ బిడ్డలకు మంచి చదువు చెప్పించలేని దుస్థితి నెలకొందని బ్రాహ్మణులు ఆవేదన చెందారు. బ్రాహ్మణ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణేతరులతో పోలిస్తే బ్రాహ్మణుల సరాసరి ఆదాయం చాలా తక్కువ. ఫలితంగా, ఇంటర్మీడియట్ స్థాయిలోనే బ్రాహ్మణ విద్యార్థుల్లో అత్యధిక శాతం చదువులకు స్వస్తి పలికేస్తున్నారు.

ఐదు నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థుల్లో.. 44 శాతం మంది ప్రాథమిక విద్య స్థాయిలోనే బడికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. 36 శాతం మంది పదో తరగతి దాటడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ బ్రాహ్మణుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా లేదని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణుల దీనావస్థకు సంబంధించిన గణాంకాలను ఇటీవల కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే చదివి వినిపించారు. క్రిస్టియన్ల తలసరి ఆదాయం రూ.1562 అయితే.. వక్క లింగాలు రూ.914, ముస్లింలు రూ.794, ఎస్సీలు రూ.680, ఎస్టీలు రూ.577 ఉంటే ఆ రాష్ట్రంలో బ్రాహ్మణుల తలసరి ఆదాయం రూ.537గా ఉందని స్పష్టం చేశారు. తొలి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అత్యధికంగా ఉండేవారు.

ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, వైద్యులు వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలనూ పొందారు. కానీ, ప్రస్తుతం బ్రాహ్మణేతరులకే పెద్దపీట వేసే ప్రభుత్వ విధాన నిర్ణయాల కారణంగా బ్రాహ్మణులు ఆయా రంగాల నుంచి ఎప్పుడో కనుమరుగయ్యారని, ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తే.. ఆ రాష్ట్రంలో అత్యధిక బ్రాహ్మణులు ఇళ్లల్లో పనివారుగా బతుకీడుస్తున్నారని రాధాకృష్ణ తన సర్వేలో వెల్లడించారు. ఇదంతా ప్రతిభ లేక.. చదవలేక కాదు.. చదువును కొనుక్కునే స్తోమత లేకనే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు వీరికి అందవు.

కేవలం నెలకు రూ.500తో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అని వెల్లడించారు. ఇందుకు కారణం.. ప్రభుత్వం నుంచి ఒక్క పథకమూ వారికి అందదు. రాష్ట్రవ్యాప్తంగా 56 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బ్రాహ్మణులు ఉన్నా.. రచ్చబండ లాంటి కార్యక్రమాలు వారికి బహు దూరం. అగ్ర కులం పేరిట నిరుపేద బ్రాహ్మణులనూ ప్రభుత్వ పథకాలకు దూరం చేసేశారు.

సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరికీ తెల్లకార్డులు అందుతాయి. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు తదితర ప్రభుత్వ పథకాలు దక్కుతాయి. కానీ, బ్రాహ్మణులకు మాత్రం ఇవన్నీ దూరమే. బ్రాహ్మణుల్లో కేవలం పది శాతం మించి ఉన్నత విద్యనభ్యసించే పరిస్థితి లేదు. 35 శాతం అర్చకులుగా, పౌరోహిత్యంలోనూ జీవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు

Courtesy: Andhrajyothy Telugu Daily