"తెలుగు వాడి ఖ్యాతి ప్రపంచానికి తెలిసిన తరువాతే తెలుగు వారికీ తెలుస్తుంది
" .ప్రపంచ వ్యాప్తంగా
కీర్తి ఆర్జించిన ఎందరూ మహానుబావులు ఇక్కడ నిరా దరణ కు గురి ఆతున్నారు
‘‘అవును...
నా దృష్టిలో మీ విధానాలు స్వాతంత్య్రోద్యమానికి హానిచేసేవిగా ఉన్నాయి.
సవరించుకోమని సంపాదకీయం ద్వారా కోరాను. నేను చేసింది తప్పని మీరు
అనుకుంటే... ‘లీడర్’ పత్రికకు ఈ క్షణమే రాజీనామా చేస్తాను’’ అంటూ వెంటనే
రాజీనామా లేఖను లీడర్ పత్రిక వ్యవస్థాపకులు మోతీలాల్ నెహ్రూకు నిబ్బరంగా
అందజేసిన ధీశాలి సీవై చింతామణి. జర్నలిజం పట్ల చింతామణికున్న నిబద్ధతను
చూసి అబ్బురపడ్డ మోతీలాల్, ఆయన సమర్పించిన రాజీనామాను తిరస్కరించారు. 1880
ఏప్రిల్ 10న విజయనగరంలోని పండిత కుటుంబంలో జన్మించిన చిర్రావూరి యజ్ఞేశ్వర
చింతామణి, చిన్నప్పుడే తండ్రి మరణించడంతో మెట్రిక్యులేషన్‌కు మించి
చదవకపోయినా ఆంగ్లభాషలో మంచి పట్టును సాధించి వర్తమాన రాజకీయాలపై ఆంగ్ల
పత్రికలకు వ్యాసాలు రాసేవారు. 18 ఏళ్ల పిన్న వయసులోనే ‘వైజాగ్ స్పెక్టేటర్’
పత్రికకు సంపాదకత్వం వహించారు. ది హిందూ, మద్రాస్ స్టాండర్డ్ వంటి
పత్రికల్లో కొన్నాళ్లు పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ, మదన్‌మోహన్ మాలవ్యా
వ్యవస్థాపకులుగా ప్రారంభమైన ‘లీడర్’ పత్రికకు దశాబ్దాల పాటు సంపాదకత్వం
వహించి భారతీయులనే గాక, బ్రిటిష్ పాలకులనూ మంత్రముగ్దులనుగావించారు.
‘‘చింతామణి సంపాదకీయాలు స్వాతంత్య్ర సమరయోధులను ఉత్తేజపరుస్తున్నాయి. ఆయన
సూచనలు నాకెంతో ఉపకరిస్తున్నాయి’’ అని గాంధీతో ప్రశంసలందుకోవడం చింతామణికే
సాధ్యమయింది. లీడర్ సంపాదకీయాలను బ్రిటిష్ అధికారులు కూడా శ్రద్ధగా
చదివేవారు.
మంచి ఆంగ్ల పదాలను వాడీవేడిగా తన సంపాదకీయాల్లో
సందర్భోచితంగానూ, సమతూకంగానూ రంగరించి వాడేవారు. చింతామణి పత్రికా
సంపాదకులే కాక, మంచి వక్త కూడా. తాను చెప్పదలచిన అంశాన్ని శ్రోతల హృదయాలకు
హత్తుకునేలా స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో అలహాబాద్‌లో జరిగిన
అన్ని సాహిత్య, సాంస్కృతిక సభల్లో చింతామణి పేరు ప్రముఖంగా కనిపించేదన్నది
ఇప్పటికీ గుర్తుచేసుకునే వారు ఉన్నారు. సభల్లో వితంతు వివాహాలను
ప్రోత్సహించి, అంటరానితనం, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించేవారు.
ఉపన్యాసాలకే పరిమితం కాక, వితంతువైన కృష్ణవేణిని చింతామణి వివాహం చేసుకుని
ఆదర్శప్రాయంగా నిలిచారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు
శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ఆనాటి యునెటైడ్ ప్రావిన్సెస్‌కు విద్యా
మంత్రిగా కొంత కాలం కొనసాగారు. లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌టేబుల్
సమావేశాలకు చింతామణి ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయన ప్రతిభకు మెచ్చిన
బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది. బెనారస్ హిందూ
యూనివర్సిటీ వీరికి గౌరవ డాక్టరేట్ బహుకరించింది. లీడర్ పత్రిక ద్వారా
యావత్ భారతావనిలో గొప్ప సంపాదకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ‘పోప్ ఆఫ్
ఇండియన్ జర్నలిజం’గా వేనోళ్ల కీర్తినొందిన సీవై చింతామణి 1941 జూలై 1న
తుదిశ్వాస విడిచారు.
మనం మరచిపోయిన చింతామణి ని ఉత్తర ప్రదేశ్ గురవించింది. ఆ రాస్తాం లోని అల్లహాబాద్ నగరం లో చింతామణి కాలనీ ,చింతామణి రోడ్ అని అయన జ్ఞాపకార్ధం నేలకోల్పారు. మన జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికైనా అయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేపడితే ముదావహం.
|
|
|
|
|
|
|
|
|
|
| Previous Next |
|
|
|
|
No comments:
Post a Comment