Total Pageviews

Tuesday, May 29, 2012

50 Rs- 18 Years- Landmark judgement

"అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. తక్కువలో తక్కువగా రూ.50 లంచం తీసుకున్నా సరే వదిలిపెట్టొద్దు'' అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అవినీతిపరులకు అవినీతి నిరోధక చట్టంలో పేర్కొన్న ఆరు నెలల కనీస శిక్షను తగ్గించడం సుప్రీం కోర్టు అయినా సరే సరికాదని వ్యాఖ్యానించింది. రూ.50 లంచం తీసుకున్నందుకు ఇద్దరు గుజరాతీ అధికారులను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారించింది. ఆరు నెలల జైలుశిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసినా అక్కడ కూడా అదే శిక్షను ఖరారు చేసింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటన జరిగి 18 ఏళ్లు అయ్యిందని, తాము ఉద్యోగాలు కూడా కోల్పోయామని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, "లంచం తీసుకున్న మొత్తం చిన్నదే కావచ్చు. ఇటువంటి ధోరణులను నిరోధించేందుకే చట్టం కనీస శిక్షను విధించింది. ఏ స్థాయిలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించరాదు'' అని జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 గుజరాత్ రాస్త్రనికి చెందిన మునిచిపల్ ఉద్యొగులు నరెంద్ర చంపక్ లాల్, హర్జిభై దెవ్జిభై 1994 లొ గజెంద్ర జగదిష్ జెడీజ అనే వ్యక్థి నుంచి ఈ మొత్తం పుచ్చుకొన్నారు. భవ్నగర్ లొని పురపాలక సంఘ కార్యలయంలొ ఈ మొత్తం తీసుకొంటుండగా 1994 మార్చ్ 15 న వీరిని అర్రెస్ట్ చెసారు.ట్రైల్ కొర్ట్  వీరికి 6 మాసాలు ఖైదు విధించింది.

Thursday, May 24, 2012

ఊరికో బెల్టుషాపు..



మద్యం షాపులపై ఏసీబీ దాడులు అధికం కావడంతో రెండు నెలలుగా లెసైన్సు ఉన్న షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. ఇలాగైతే లాభాలు రావడం లేదని గ్రహించిన వ్యాపారులు బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలను పెంచారు. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం పదివేలకు పైగా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో కన్నా బెల్టుషాపుల్లోనే అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఇక్కడ ఐదు రూపాయలు అదనంగా క్వార్టర్ బాటిల్‌కు వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోని అన్ని పంచాయతీల్లోను ఒకటి, రెండు చొప్పున బెల్టుషాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి సెంటర్‌కు రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారులు ప్రాంతాలవారీగా బెల్టుషాపులను విభజించుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు.

పట్టించుకోని పోలీసులు..
గత నెలలో  అందరు డీఎస్పీలు బెల్టుషాపులను మూసివేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టుషాపులు పది రోజుల పాటు మూతపడ్డాయి. మే నెల ప్రారంభం నుంచి మళ్లీ తెరుచుకున్నాయి. ప్రారంభంలో ఉన్న పోలీసుల హడావుడి రానురాను తగ్గిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు అనుకుంటున్న సమయంలోనే మళ్లీ బెల్టుషాపులు తెరుచుకోవడంతో అవాక్కవడం ప్రజల వంతయింది. మద్యం సిండికేట్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బెల్టుషాపులను మళ్లీ నడుపుతున్నారనే వాదన లేకపోలేదు. గత నెల 27న గిలకలదిండిలో ప్రజాపథం జరిగిన సమయంలో అక్కడ బెల్టుషాపు కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై మహిళలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. పోలీసులే ఈ బెల్టుషాపుపై దాడిచేసి మూయించివేశారు. పట్టుమని పది రోజులు కాకుండానే మళ్లీ ఈ బెల్టుషాపులో మద్యం విక్రయాలు యథావిధిగా జరగడం విశేషం. కాలేఖాన్‌పేట వద్ద రెండు బెల్టుషాపులున్నాయి. ఓ బెల్టు షాపు పక్కనే ప్రయాణికుల విశ్రాంతికోసం కట్టిన షెడ్డు తాగుబోతులకు డెన్‌గా మారింది. రాత్రి ఏడు గంటలకల్లా ఈ షెడ్డు మందుబాబులతో నిండిపోతోంది.

అధిక ధరలకు విక్రయాలు...
మంగినపూడి బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. అన్ని షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయాలు జరుగుతున్నా బీచ్‌లోని మద్యం షాపులో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఆవైపు చూసిన దాఖ లాలే లేవు. పోలీసులు, వ్యాపారులు కుమ్మక్కై బెల్టుషాపులను జోరుగా నడుపుతున్నారనే విమర్శలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.

Tuesday, May 15, 2012

C.Y. Chintamani

"తెలుగు వాడి ఖ్యాతి ప్రపంచానికి తెలిసిన తరువాతే తెలుగు వారికీ తెలుస్తుంది " .ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఆర్జించిన ఎందరూ మహానుబావులు ఇక్కడ నిరా దరణ కు గురి ఆతున్నారు                                                                                                                                                                                     ‘‘అవును... నా దృష్టిలో మీ విధానాలు స్వాతంత్య్రోద్యమానికి హానిచేసేవిగా ఉన్నాయి. సవరించుకోమని సంపాదకీయం ద్వారా కోరాను. నేను చేసింది తప్పని మీరు అనుకుంటే... ‘లీడర్’ పత్రికకు ఈ క్షణమే రాజీనామా చేస్తాను’’ అంటూ వెంటనే రాజీనామా లేఖను లీడర్ పత్రిక వ్యవస్థాపకులు మోతీలాల్ నెహ్రూకు నిబ్బరంగా అందజేసిన ధీశాలి సీవై చింతామణి. జర్నలిజం పట్ల చింతామణికున్న నిబద్ధతను చూసి అబ్బురపడ్డ మోతీలాల్, ఆయన సమర్పించిన రాజీనామాను తిరస్కరించారు. 1880 ఏప్రిల్ 10న విజయనగరంలోని పండిత కుటుంబంలో జన్మించిన చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి, చిన్నప్పుడే తండ్రి మరణించడంతో మెట్రిక్యులేషన్‌కు మించి చదవకపోయినా ఆంగ్లభాషలో మంచి పట్టును సాధించి వర్తమాన రాజకీయాలపై ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాసేవారు. 18 ఏళ్ల పిన్న వయసులోనే ‘వైజాగ్ స్పెక్టేటర్’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ది హిందూ, మద్రాస్ స్టాండర్డ్ వంటి పత్రికల్లో కొన్నాళ్లు పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ, మదన్‌మోహన్ మాలవ్యా వ్యవస్థాపకులుగా ప్రారంభమైన ‘లీడర్’ పత్రికకు దశాబ్దాల పాటు సంపాదకత్వం వహించి భారతీయులనే గాక, బ్రిటిష్ పాలకులనూ మంత్రముగ్దులనుగావించారు.

‘‘చింతామణి సంపాదకీయాలు స్వాతంత్య్ర సమరయోధులను ఉత్తేజపరుస్తున్నాయి. ఆయన సూచనలు నాకెంతో ఉపకరిస్తున్నాయి’’ అని గాంధీతో ప్రశంసలందుకోవడం చింతామణికే సాధ్యమయింది. లీడర్ సంపాదకీయాలను బ్రిటిష్ అధికారులు కూడా శ్రద్ధగా చదివేవారు.

మంచి ఆంగ్ల పదాలను వాడీవేడిగా తన సంపాదకీయాల్లో సందర్భోచితంగానూ, సమతూకంగానూ రంగరించి వాడేవారు. చింతామణి పత్రికా సంపాదకులే కాక, మంచి వక్త కూడా. తాను చెప్పదలచిన అంశాన్ని శ్రోతల హృదయాలకు హత్తుకునేలా స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో అలహాబాద్‌లో జరిగిన అన్ని సాహిత్య, సాంస్కృతిక సభల్లో చింతామణి పేరు ప్రముఖంగా కనిపించేదన్నది ఇప్పటికీ గుర్తుచేసుకునే వారు ఉన్నారు. సభల్లో వితంతు వివాహాలను ప్రోత్సహించి, అంటరానితనం, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించేవారు. ఉపన్యాసాలకే పరిమితం కాక, వితంతువైన కృష్ణవేణిని చింతామణి వివాహం చేసుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ఆనాటి యునెటైడ్ ప్రావిన్సెస్‌కు విద్యా మంత్రిగా కొంత కాలం కొనసాగారు. లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌టేబుల్ సమావేశాలకు చింతామణి ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ వీరికి గౌరవ డాక్టరేట్ బహుకరించింది. లీడర్ పత్రిక ద్వారా యావత్ భారతావనిలో గొప్ప సంపాదకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ‘పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’గా వేనోళ్ల కీర్తినొందిన సీవై చింతామణి 1941 జూలై 1న తుదిశ్వాస విడిచారు.
మనం మరచిపోయిన చింతామణి ని ఉత్తర ప్రదేశ్ గురవించింది. ఆ రాస్తాం లోని అల్లహాబాద్ నగరం లో చింతామణి కాలనీ ,చింతామణి రోడ్ అని అయన జ్ఞాపకార్ధం నేలకోల్పారు. మన జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికైనా అయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేపడితే ముదావహం. 







Previous Next
   

Archives

May 2012
Apr 2012
Mar 2012
Feb 2012
Jan 2012
Dec 2011


Sakshi Toolbar



Wednesday, May 9, 2012

వేసవిలో బడి పిల్లలకు పస్తులేనా?

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు. బడి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం కూడా అందులో ఇమిడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేద పిల్లలే. దినదిన గండంగా బతికే పేదల పిల్లలకు పౌష్టికాహార లోపమే కాదు, పస్తులూ తప్పవు. అందుకే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల్లో నమోదు గణనీయంగా పెరిగింది. ఒక పూట భోజనానికి హామీనిస్తున్న బడులకు వేసవి సెలవులు వస్తున్నాయంటే పేద పిల్లలకు పస్తుల కాలం వస్తున్నట్టే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి గిరిజన తండాలలో పేద బడి పిల్లలు ఆకలితో అలమటించే సమస్య తీవ్రంగా ఉంది.

విద్యా హక్కు చట్టాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రతి పిల్లవానికి తప్పనిసరి ఉచిత విద్యను శాసించడం ముదావహం. అయితే పిల్లలు సెలవుల్లో కూడా కడుపు నింపుకోగలిగితేనే సక్రమంగా తిరిగి చదువులు కొనసాగించగలుగుతారని, మానవాభివృద్ధి వనరుల అభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం గుర్తించాలి. ఇక బాలలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం ఏడాది పొడవునా ఉండాల్సిందే తప్ప పాఠశాలలు తెరిచే కాలానికే పరిమితమైతే ఫలితం అంతగా ఉండదు. అన్నిటికీ మించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పేద బడి పిల్లలు పస్తులతో అల్లాడకుండా ఆదుకోవడం అవసరం.

బాల కార్మికులను బడిలో చేర్చాలి!

మానవ వికాసానికి, సర్వతో ముఖాభివృద్ధికి విద్య తప్పనిసరి. విద్యార్జన క్రమంలో ప్రాథమిక విద్య అత్యంత ప్రముఖమైనది. అందుకే మన రాజ్యాంగంలో ఆర్టి కల్ 45, 14 సంవత్సరాలలోపు బాలలందరికీ ఉచిత విద్యనందించే లక్ష్యాన్ని నిర్దేశిం చింది. (86వ సవరణ ద్వారా 6-14 సంవత్సరాల బాల లకు 21(ఎ) ప్రకారం భారతదేశ బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే చట్టబద్ధమైన హక్కు ఏర్పడింది.) ఆర్టికల్ 24, 14 సంవత్సరాలలోపు బాలలు కర్మాగారాలలో పనిచేయడాన్ని నిషేధించింది.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు విడివిడిగాను, ఉమ్మడిగాను జాతీ య బాలకార్మిక పథకం (ఎన్‌సీఎల్‌పీ), ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం (ఓబీబీ), జిల్లా ప్రాథ మిక విద్యాపథకం (డీపీఈపీ), మళ్లీ బడికి కార్యక్రమం, సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు యూనిసెఫ్, ఐఎల్‌ఓ, యూరోపియన్ యూని యన్, ప్రపంచ బ్యాంకు, కార్పొరేట్ సంస్థలు, స్థానికంగా పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థలు తమ తోడ్పాటునందిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాలకుపైగా ఆంధ్రప్రదేశ్‌లో బాలకార్మిక వ్యవ స్థను రూపుమాపేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా, ఆశించిన మేర ఫలితాలు ఉండ టం లేదు. రాష్ర్ట విద్యాశాఖ వారి గణాంకాల ప్రకారం 2003-04 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో 15,69,260 మంది విద్యార్థులు చేరగా 2007-08 విద్యా సంవత్సరంలో 5వ తరగతికి వచ్చేసరికి 2,13,502 మంది మాత్రమే మిగిలారు. ఇందులో అత్యధికులు బాలికలు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన బాలల సంఖ్య కూడా అధికమే.

ఒక తరగతిలోనే దాదాపు 4.5 లక్షల మంది బడిమానేస్తే ఇక అన్ని తరగతుల డ్రాపౌట్స్ లెక్కిస్తే ఎన్ని లక్షల మంది ఉండాలి? బడిలో చేరి బడి మానేస్తున్న వారి సంఖ్యే దాదాపు 30 శాతం ఉంటే బడి మెట్లెక్కని బాలల సంఖ్య ఇంకెంత ఉండాలి? ఒక అంచనా ప్రకారం 6-14 సంవత్సరాల బాలలు దాదాపు 50 శాతం మంది బాల కార్మికులుగా ఉన్నారు. గత సంవత్సరం మన రాష్ట్రంలో బడి బయటి బాలలు కేవలం 1.20 లక్షల మంది అని చెప్పి ప్రస్తుతం 3 లక్షలు అంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయక యాంత్రికంగా పనిచేసే యంత్రాంగం, అధికా రుల ఉదాసీనత, పథకాల పర్యవేక్షణ లోపం, అధికారుల, శాఖల మధ్య సమన్వయలోపం, ప్రభుత్వ బడుల్లో అస్తవ్యస్తమైన పర్యవేక్షణ వంటి కారణాల వలన బాల కార్మికుల జీవితాల్లో చీకటి తొలగడం లేదు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం 1986ను సవరించి అన్ని రంగాలలో బాలకార్మికులు పనిచేయడాన్ని నిషేధించి శిక్షలను కఠినతరం చేయాలి. సమర్థంగా విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయాలి. బాలికల చదువుకు ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి నాణ్య మైన వసతి గృహాలు నిర్వహించాలి. బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను నిషేధించాలి.