Total Pageviews

Sunday, October 28, 2012

National level eligibility test

 ఎంతకీ మింగుడుపడని 'నీట్'ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. తనంతట తానుగా పక్కనపట్టేయడంతో చిలుము పట్టిన కత్తికి... ఇప్పుడు పదును పెట్టి మరీ ప్రయోగించింది. ఆ అస్త్రం పేరు... ఆర్టికల్ 371 (డి). నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తప్పించుకోవడానికి ఈ ఆర్టికల్‌ను తురుఫు ముక్కగా వాడారు. ఈ అధికరణ ప్రకారం... రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలలకు సంబంధించి నీట్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. 

ఇంతకూ 371 (డి) అంటే ఏమిటి? ఇది ఎలా వచ్చింది? దీనికీ, ఆంధ్రప్రదేశ్‌కూ సంబంధమేమిటి? అనే కోణంలో చూస్తే ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్, భారత్ మధ్య జమ్మూ కాశ్మీర్ వివాదం ఏర్పడినప్పుడు కాశ్మీర్‌కు పాక్షిక స్వయంప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో ప్రత్యేక అధికరణను చేర్చారు. దీని ప్రకారం... భారత పార్లమెంటు చేసే చట్టాలు జమ్మూ కాశ్మీర్‌కు వాటంతటవిగా వర్తించవు. అక్కడి శాసనసభ కూడా ఈ చట్టాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కాశ్మీర్ సంగతి. ఇక, మన విషయానికి వస్తే...
1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం ముల్కీ రూల్స్ అమల్లో వచ్చాయి. 

1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు ముల్కీ రూల్స్‌ను కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాతి క్రమంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల హక్కుల పరిరక్షణకు పెద్ద మనుషుల ఒప్పందం రూపొందించారు. ఈ మేరకు 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి ఒప్పందాలన్నీ గతంలో అనేకం వచ్చినా వాటికి సరైన చట్టబద్ధత లేకపోవడంతో రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు కల్పించాలనే ఉద్దేశంతో... ఆంధ్రప్రదేశ్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం ఆర్టికల్ 371(డి)ను చేర్చారు. 

అన్ని విద్యా సంస్థలను రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలుగా, స్థానిక విద్యా సంస్థలుగా ప్రభుత్వ ఉద్యోగాలను, రాష్ట్ర, జోనల్, జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తయారుచేశారు. ఆర్టికల్ 371 (డి)లో పేర్కొన్న అంశాలకు అనుబంధంగా ఇది రూపొందింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించడమంటే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రపతి ఉత్తర్వుల పకడ్బందీ అమలుకోసం 610 జీవో కూడా జారీ అయ్యింది. 

స్థానికులకే రిజర్వేషన్లు...
ఆర్టికల్ 371 (డి) ప్రకారం విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు ఉంటాయి. విద్యాసంస్థల విషయానికొస్తే... 85 శాతం సీట్లు స్థానికులకు రిజర్వు చేయాలి. 15 శాతం ఓపెన్ కేటగిరీకి ఇవ్వాలి. ఆ విద్యాసంస్థ రాష్ట్రస్థాయిదైతే రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలి. ప్రాంతీయ స్థాయిదైతే ఆ ప్రాంతం వారికి 85 శాతం సీట్లు రిజర్వు చేసి మిగతా 15 శాతం ఓపెన్ కేటగిరీలో ఇచ్చుకోవచ్చు. ఇందుకుగాను మూడు ప్రాంతాల మధ్య సీట్ల విభజన కూడా జరిగింది. తెలంగాణకు 42 శాతం, కోస్తాంధ్రకు 36 శాతం, రాయలసీమకు 22 శాతం సీట్లను రాష్ట్ర స్థాయి విద్యాసంస్థల్లో కేటాయించాల్సి ఉంటుంది. 

నీట్ అమలులోకి వస్తే... రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయించాలన్న నిబంధనను ఉల్లంఘించినట్లే. నీట్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కూడా ఇదే నిబంధనను ఉపయోగించుకుంది. అయితే... 371 (డి) రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని, ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయ సమ్మతంకాదని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

అయితే... సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. కొన్ని కేసుల్లో డివిజన్ బెంచ్ అప్పీలుకెళ్తామన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు. సుదీర్ఘ ఉద్యమాలు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం రూపొందిన ఈ రాజ్యాంగ నిబంధనను కొట్టివేయలేమని తేల్చిచెప్పింది. 371 (డి)కి అంత శక్తి ఉంది. 

కానీ...
ప్రభుత్వమే తూట్లు పొడిచింది..

ఆర్టికల్ 371 (డి) కింద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లే కాదు... మరిన్ని ప్రత్యేక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయి. ఈ నిబంధనలకు అనుగుణంగానే హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. ఉద్యోగుల సర్వీసు, పదోన్నతులు తదితర అంశాలను విచారించేందుకు రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటయింది. దీనికి విశేషాధికారాలు కల్పించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని, ఈ తీర్పులను హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. 

అయితే... 1989లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌నే రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు కేంద్రం ఓ చట్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన, సర్వాధికారాలు ఉన్న రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేసింది. 1959 నవంబర్ 1 నుంచి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ట్రిబ్యునల్‌కున్న విశేషాధికారాలు పోయాయి. ట్రిబ్యునల్ తీర్పులను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టులో కేసులు దాఖలు అవుతున్నాయి. అంటే... ట్రిబ్యునల్ పూర్వ వైభవాన్ని కోల్పోయి సాధారణ కోర్టుల స్థాయికి వచ్చింది.

Thursday, October 25, 2012

oka sukravaram saayanthram ఎడతెరిపి లేకుండా  వర్షం కురుస్తుంది.అపుడే పని ముగుంచుకోని ఆఫీస్ నుండి బయటకి వొచ్చిన నాకు కనుచూపు మీరకు రోడ్లలని జలమయం  కనిపిస్తున్నాయి.ఇంతలో నా సెల్ ఫోన్ మోగింది .అప్పటికే  పది సార్లు ఫోన్  చేసిన నా భార్య పదకొండసారి ఫోన్ చేససింది. కొంచం కొపం కొంచం నిస్థురం కలిపి "పిల్లాడి  మొదటి పుట్టిన రోజు కు కూడా రా ర ?"  అడిగిందింది .దానికి సమాధానంగా "వొస్తున్ననే బయలుదేరా , తెల్లవారేసరికి అక్కడ వుంటా " అని సమాధానం చెప్పా .రోడ్లు చూస్తీ భారీగా నీళ్ళు .ఓ పక్క భారీగా కురుస్తున్న వర్షం .ఆఫీస్ నుంచి బస్స్టాండ్ కి  వెళ్ళే లోపే  కచ్చితంగా తడిసిపోతా.పోనీ ట్రైన్ కి వెల్లడమ అంటె మనకి రైళ్ళ గురించి పెద్దగ తెలియదు .  రైలుకి వేల్ల్డమని నిర్ణయం తీసుకొన్నా.

ఆ వానలో తడుస్తూ బస్సు కోసం  ఎదురు చూస్తూన్న. తడిసిన  బట్టలతో నీళ్ళు  కారుతున్న  బూట్లతో బస్సు కోసం ఎదురుచూసా. చెన్నై  మహానగరం లో ఉన్న   సగం జనభా ఈ బస్సు లోనే ఉన్నారా !!!!! అనే అంతః  గా కిక్కిరిసి బస్సు వొచ్చింది .బస్సు లో టికెట్ తీసుకోవడానికి నేను   పడిన  పాట్లు నాకు దేవుడికే తెలుసు . 

Monday, June 18, 2012

kasi temple facts

హిందు టెంపుల్స్ - వ్హత్ హప్పెండ్ తొ థెం. అన్న పుస్తకాని ఎమధ్యనె చదివాను.1990 లొ విడుదల అయ్యిన రెందు సంపుతల ఈ పుస్తకం  సీతారం గొయల్, అరున్ సౌరి, హర్ష నారయణ్ లాంతి ప్రముకులు సంకలనం చెయ్యతం ఒక విశెషం.ఈ పుస్తకం లొ 2000 మసిదులు హిందు దేవాలయలని కూల్చి కట్టిన విషయలను ఆధారలతొ సహా వెల్లడించారు.ఆయితె వారు  వెల్లడించిన విషయాలు సమగ్రం కాదని, ఇంకొ 10000కు పైన ధ్వసం చెయ్యబడిన అలయాల వివరాలు త్వరొలొ వెల్లడిస్థామని తెలిపారు.ఆ పుస్తకం లొని వివరాలు ప్రకారం అసలైన కాసి విస్వనాధుని ఆలయం గుప్తుల కాలంలొ క్రీ.శ. 490లొ నిర్మించారు. దాన్ని మొహ్మదీయులు ధ్వంసం చెసి పెద్ద మసిద్ నిర్మించారు.1777 లొ ఇప్పుడు ఉన్న దెవాలయన్ని ఆహల్య భై హూల్కర్ నిర్మించారు.మహరాజ రంజిత్ సింఘ్ 1839 లొ గూపురానికి స్వర్ణ తాపడం చెయ్యించారు. ఈనాటికి కాశి విశ్వనధుని ఆలయం వెనుక ఘ్ననవాసి మసిద్ కనిపిస్తుంది.


అలాగె మన రాజమండ్రి పెద్ద మస్సీదు లొ కూడా కొన్ని స్థంబాల పైన దసావతారాలు చెక్కి ఉన్నయిట!!!! నిజం దెవుడికే తెలియాలి.      

Tuesday, May 29, 2012

50 Rs- 18 Years- Landmark judgement

"అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. తక్కువలో తక్కువగా రూ.50 లంచం తీసుకున్నా సరే వదిలిపెట్టొద్దు'' అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అవినీతిపరులకు అవినీతి నిరోధక చట్టంలో పేర్కొన్న ఆరు నెలల కనీస శిక్షను తగ్గించడం సుప్రీం కోర్టు అయినా సరే సరికాదని వ్యాఖ్యానించింది. రూ.50 లంచం తీసుకున్నందుకు ఇద్దరు గుజరాతీ అధికారులను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారించింది. ఆరు నెలల జైలుశిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసినా అక్కడ కూడా అదే శిక్షను ఖరారు చేసింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటన జరిగి 18 ఏళ్లు అయ్యిందని, తాము ఉద్యోగాలు కూడా కోల్పోయామని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, "లంచం తీసుకున్న మొత్తం చిన్నదే కావచ్చు. ఇటువంటి ధోరణులను నిరోధించేందుకే చట్టం కనీస శిక్షను విధించింది. ఏ స్థాయిలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించరాదు'' అని జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 గుజరాత్ రాస్త్రనికి చెందిన మునిచిపల్ ఉద్యొగులు నరెంద్ర చంపక్ లాల్, హర్జిభై దెవ్జిభై 1994 లొ గజెంద్ర జగదిష్ జెడీజ అనే వ్యక్థి నుంచి ఈ మొత్తం పుచ్చుకొన్నారు. భవ్నగర్ లొని పురపాలక సంఘ కార్యలయంలొ ఈ మొత్తం తీసుకొంటుండగా 1994 మార్చ్ 15 న వీరిని అర్రెస్ట్ చెసారు.ట్రైల్ కొర్ట్  వీరికి 6 మాసాలు ఖైదు విధించింది.

Thursday, May 24, 2012

ఊరికో బెల్టుషాపు..



మద్యం షాపులపై ఏసీబీ దాడులు అధికం కావడంతో రెండు నెలలుగా లెసైన్సు ఉన్న షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. ఇలాగైతే లాభాలు రావడం లేదని గ్రహించిన వ్యాపారులు బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలను పెంచారు. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం పదివేలకు పైగా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో కన్నా బెల్టుషాపుల్లోనే అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఇక్కడ ఐదు రూపాయలు అదనంగా క్వార్టర్ బాటిల్‌కు వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోని అన్ని పంచాయతీల్లోను ఒకటి, రెండు చొప్పున బెల్టుషాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి సెంటర్‌కు రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారులు ప్రాంతాలవారీగా బెల్టుషాపులను విభజించుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు.

పట్టించుకోని పోలీసులు..
గత నెలలో  అందరు డీఎస్పీలు బెల్టుషాపులను మూసివేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టుషాపులు పది రోజుల పాటు మూతపడ్డాయి. మే నెల ప్రారంభం నుంచి మళ్లీ తెరుచుకున్నాయి. ప్రారంభంలో ఉన్న పోలీసుల హడావుడి రానురాను తగ్గిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు అనుకుంటున్న సమయంలోనే మళ్లీ బెల్టుషాపులు తెరుచుకోవడంతో అవాక్కవడం ప్రజల వంతయింది. మద్యం సిండికేట్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బెల్టుషాపులను మళ్లీ నడుపుతున్నారనే వాదన లేకపోలేదు. గత నెల 27న గిలకలదిండిలో ప్రజాపథం జరిగిన సమయంలో అక్కడ బెల్టుషాపు కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై మహిళలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. పోలీసులే ఈ బెల్టుషాపుపై దాడిచేసి మూయించివేశారు. పట్టుమని పది రోజులు కాకుండానే మళ్లీ ఈ బెల్టుషాపులో మద్యం విక్రయాలు యథావిధిగా జరగడం విశేషం. కాలేఖాన్‌పేట వద్ద రెండు బెల్టుషాపులున్నాయి. ఓ బెల్టు షాపు పక్కనే ప్రయాణికుల విశ్రాంతికోసం కట్టిన షెడ్డు తాగుబోతులకు డెన్‌గా మారింది. రాత్రి ఏడు గంటలకల్లా ఈ షెడ్డు మందుబాబులతో నిండిపోతోంది.

అధిక ధరలకు విక్రయాలు...
మంగినపూడి బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. అన్ని షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయాలు జరుగుతున్నా బీచ్‌లోని మద్యం షాపులో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఆవైపు చూసిన దాఖ లాలే లేవు. పోలీసులు, వ్యాపారులు కుమ్మక్కై బెల్టుషాపులను జోరుగా నడుపుతున్నారనే విమర్శలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.

Tuesday, May 15, 2012

C.Y. Chintamani

"తెలుగు వాడి ఖ్యాతి ప్రపంచానికి తెలిసిన తరువాతే తెలుగు వారికీ తెలుస్తుంది " .ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఆర్జించిన ఎందరూ మహానుబావులు ఇక్కడ నిరా దరణ కు గురి ఆతున్నారు                                                                                                                                                                                     ‘‘అవును... నా దృష్టిలో మీ విధానాలు స్వాతంత్య్రోద్యమానికి హానిచేసేవిగా ఉన్నాయి. సవరించుకోమని సంపాదకీయం ద్వారా కోరాను. నేను చేసింది తప్పని మీరు అనుకుంటే... ‘లీడర్’ పత్రికకు ఈ క్షణమే రాజీనామా చేస్తాను’’ అంటూ వెంటనే రాజీనామా లేఖను లీడర్ పత్రిక వ్యవస్థాపకులు మోతీలాల్ నెహ్రూకు నిబ్బరంగా అందజేసిన ధీశాలి సీవై చింతామణి. జర్నలిజం పట్ల చింతామణికున్న నిబద్ధతను చూసి అబ్బురపడ్డ మోతీలాల్, ఆయన సమర్పించిన రాజీనామాను తిరస్కరించారు. 1880 ఏప్రిల్ 10న విజయనగరంలోని పండిత కుటుంబంలో జన్మించిన చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి, చిన్నప్పుడే తండ్రి మరణించడంతో మెట్రిక్యులేషన్‌కు మించి చదవకపోయినా ఆంగ్లభాషలో మంచి పట్టును సాధించి వర్తమాన రాజకీయాలపై ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాసేవారు. 18 ఏళ్ల పిన్న వయసులోనే ‘వైజాగ్ స్పెక్టేటర్’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ది హిందూ, మద్రాస్ స్టాండర్డ్ వంటి పత్రికల్లో కొన్నాళ్లు పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ, మదన్‌మోహన్ మాలవ్యా వ్యవస్థాపకులుగా ప్రారంభమైన ‘లీడర్’ పత్రికకు దశాబ్దాల పాటు సంపాదకత్వం వహించి భారతీయులనే గాక, బ్రిటిష్ పాలకులనూ మంత్రముగ్దులనుగావించారు.

‘‘చింతామణి సంపాదకీయాలు స్వాతంత్య్ర సమరయోధులను ఉత్తేజపరుస్తున్నాయి. ఆయన సూచనలు నాకెంతో ఉపకరిస్తున్నాయి’’ అని గాంధీతో ప్రశంసలందుకోవడం చింతామణికే సాధ్యమయింది. లీడర్ సంపాదకీయాలను బ్రిటిష్ అధికారులు కూడా శ్రద్ధగా చదివేవారు.

మంచి ఆంగ్ల పదాలను వాడీవేడిగా తన సంపాదకీయాల్లో సందర్భోచితంగానూ, సమతూకంగానూ రంగరించి వాడేవారు. చింతామణి పత్రికా సంపాదకులే కాక, మంచి వక్త కూడా. తాను చెప్పదలచిన అంశాన్ని శ్రోతల హృదయాలకు హత్తుకునేలా స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో అలహాబాద్‌లో జరిగిన అన్ని సాహిత్య, సాంస్కృతిక సభల్లో చింతామణి పేరు ప్రముఖంగా కనిపించేదన్నది ఇప్పటికీ గుర్తుచేసుకునే వారు ఉన్నారు. సభల్లో వితంతు వివాహాలను ప్రోత్సహించి, అంటరానితనం, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించేవారు. ఉపన్యాసాలకే పరిమితం కాక, వితంతువైన కృష్ణవేణిని చింతామణి వివాహం చేసుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ఆనాటి యునెటైడ్ ప్రావిన్సెస్‌కు విద్యా మంత్రిగా కొంత కాలం కొనసాగారు. లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌టేబుల్ సమావేశాలకు చింతామణి ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ వీరికి గౌరవ డాక్టరేట్ బహుకరించింది. లీడర్ పత్రిక ద్వారా యావత్ భారతావనిలో గొప్ప సంపాదకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ‘పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’గా వేనోళ్ల కీర్తినొందిన సీవై చింతామణి 1941 జూలై 1న తుదిశ్వాస విడిచారు.
మనం మరచిపోయిన చింతామణి ని ఉత్తర ప్రదేశ్ గురవించింది. ఆ రాస్తాం లోని అల్లహాబాద్ నగరం లో చింతామణి కాలనీ ,చింతామణి రోడ్ అని అయన జ్ఞాపకార్ధం నేలకోల్పారు. మన జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికైనా అయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేపడితే ముదావహం. 







Previous Next
   

Archives

May 2012
Apr 2012
Mar 2012
Feb 2012
Jan 2012
Dec 2011


Sakshi Toolbar



Wednesday, May 9, 2012

వేసవిలో బడి పిల్లలకు పస్తులేనా?

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు. బడి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం కూడా అందులో ఇమిడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేద పిల్లలే. దినదిన గండంగా బతికే పేదల పిల్లలకు పౌష్టికాహార లోపమే కాదు, పస్తులూ తప్పవు. అందుకే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల్లో నమోదు గణనీయంగా పెరిగింది. ఒక పూట భోజనానికి హామీనిస్తున్న బడులకు వేసవి సెలవులు వస్తున్నాయంటే పేద పిల్లలకు పస్తుల కాలం వస్తున్నట్టే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి గిరిజన తండాలలో పేద బడి పిల్లలు ఆకలితో అలమటించే సమస్య తీవ్రంగా ఉంది.

విద్యా హక్కు చట్టాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రతి పిల్లవానికి తప్పనిసరి ఉచిత విద్యను శాసించడం ముదావహం. అయితే పిల్లలు సెలవుల్లో కూడా కడుపు నింపుకోగలిగితేనే సక్రమంగా తిరిగి చదువులు కొనసాగించగలుగుతారని, మానవాభివృద్ధి వనరుల అభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం గుర్తించాలి. ఇక బాలలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం ఏడాది పొడవునా ఉండాల్సిందే తప్ప పాఠశాలలు తెరిచే కాలానికే పరిమితమైతే ఫలితం అంతగా ఉండదు. అన్నిటికీ మించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పేద బడి పిల్లలు పస్తులతో అల్లాడకుండా ఆదుకోవడం అవసరం.

బాల కార్మికులను బడిలో చేర్చాలి!

మానవ వికాసానికి, సర్వతో ముఖాభివృద్ధికి విద్య తప్పనిసరి. విద్యార్జన క్రమంలో ప్రాథమిక విద్య అత్యంత ప్రముఖమైనది. అందుకే మన రాజ్యాంగంలో ఆర్టి కల్ 45, 14 సంవత్సరాలలోపు బాలలందరికీ ఉచిత విద్యనందించే లక్ష్యాన్ని నిర్దేశిం చింది. (86వ సవరణ ద్వారా 6-14 సంవత్సరాల బాల లకు 21(ఎ) ప్రకారం భారతదేశ బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే చట్టబద్ధమైన హక్కు ఏర్పడింది.) ఆర్టికల్ 24, 14 సంవత్సరాలలోపు బాలలు కర్మాగారాలలో పనిచేయడాన్ని నిషేధించింది.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు విడివిడిగాను, ఉమ్మడిగాను జాతీ య బాలకార్మిక పథకం (ఎన్‌సీఎల్‌పీ), ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం (ఓబీబీ), జిల్లా ప్రాథ మిక విద్యాపథకం (డీపీఈపీ), మళ్లీ బడికి కార్యక్రమం, సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు యూనిసెఫ్, ఐఎల్‌ఓ, యూరోపియన్ యూని యన్, ప్రపంచ బ్యాంకు, కార్పొరేట్ సంస్థలు, స్థానికంగా పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థలు తమ తోడ్పాటునందిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాలకుపైగా ఆంధ్రప్రదేశ్‌లో బాలకార్మిక వ్యవ స్థను రూపుమాపేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా, ఆశించిన మేర ఫలితాలు ఉండ టం లేదు. రాష్ర్ట విద్యాశాఖ వారి గణాంకాల ప్రకారం 2003-04 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో 15,69,260 మంది విద్యార్థులు చేరగా 2007-08 విద్యా సంవత్సరంలో 5వ తరగతికి వచ్చేసరికి 2,13,502 మంది మాత్రమే మిగిలారు. ఇందులో అత్యధికులు బాలికలు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన బాలల సంఖ్య కూడా అధికమే.

ఒక తరగతిలోనే దాదాపు 4.5 లక్షల మంది బడిమానేస్తే ఇక అన్ని తరగతుల డ్రాపౌట్స్ లెక్కిస్తే ఎన్ని లక్షల మంది ఉండాలి? బడిలో చేరి బడి మానేస్తున్న వారి సంఖ్యే దాదాపు 30 శాతం ఉంటే బడి మెట్లెక్కని బాలల సంఖ్య ఇంకెంత ఉండాలి? ఒక అంచనా ప్రకారం 6-14 సంవత్సరాల బాలలు దాదాపు 50 శాతం మంది బాల కార్మికులుగా ఉన్నారు. గత సంవత్సరం మన రాష్ట్రంలో బడి బయటి బాలలు కేవలం 1.20 లక్షల మంది అని చెప్పి ప్రస్తుతం 3 లక్షలు అంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయక యాంత్రికంగా పనిచేసే యంత్రాంగం, అధికా రుల ఉదాసీనత, పథకాల పర్యవేక్షణ లోపం, అధికారుల, శాఖల మధ్య సమన్వయలోపం, ప్రభుత్వ బడుల్లో అస్తవ్యస్తమైన పర్యవేక్షణ వంటి కారణాల వలన బాల కార్మికుల జీవితాల్లో చీకటి తొలగడం లేదు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం 1986ను సవరించి అన్ని రంగాలలో బాలకార్మికులు పనిచేయడాన్ని నిషేధించి శిక్షలను కఠినతరం చేయాలి. సమర్థంగా విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయాలి. బాలికల చదువుకు ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి నాణ్య మైన వసతి గృహాలు నిర్వహించాలి. బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను నిషేధించాలి.

 

Friday, April 27, 2012

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం

 రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం పరిస్థితి అత్యంత దయనీ యంగా ఉంది. కర్ణాటకలో 55 శాతం బ్రాహ్మణ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉండ గా, మన రాష్ట్రంలో వాటి సంఖ్య 60 శాతం. దిగజారిపోతున్న ఈ సామాజికవర్గం స్థితిగతులను వివిధ సాంఘిక రాజకీయ వేది కల మీద ప్రస్తావించడం కానీ చర్చించడం కానీ జరగడంలేదు. కూలంకషంగా అధ్యయనం చేయడానికి ఎవరూ ముందు కు రావడంలేదు. కనీసం ఆ సామాజిక వర్గంలో ఉన్నత స్థానాలకు చేరినవారు, మేధావులు కూడా పట్టించుకోవ డంలేదు. గతంలో బ్రాహ్మణులపై సామాన్యజనానికి ఏర్పడిన అభిప్రాయాలకు, నేటి వాస్తవ స్థితిగతులకు పొం తనలేదు.

బ్రాహ్మణులకు గతంలో భూకమతాలున్నప్పటికీ, కారణాలేమైనా ఇప్పుడవన్నీ హరించాయి. సొంత భూములు కలిగి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుం బాలు చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చు. పెట్టు బడి పెట్టగలిగే స్థోమతలేని కారణంగా ఈ సామాజిక వర్గం పారిశ్రామిక, వ్యాపార వాణిజ్య రంగాలలో కూడా నామమాత్రంగానే కనిపిస్తుంది.

బ్రాహ్మణుల్లో దాదాపు 30 శాతం పౌరోహిత్యం చేసుకుంటూనో దేవాలయాల్లో పూజారులగానో జీవనం సాగిస్తున్నారు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారే. పూజారుల నెలసరి ఆదాయం రూ.1,500 కూడా ఉండదు. పురోహితుల నెలసరి ఆదాయం రూ.2,000కు మించదు. దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహించా లన్నా, పౌరోహిత్యం చేసుకోవాలన్నా, అందుకు అవసర మైన వేదవిద్యను అభ్యసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లు వేదపాఠశాలల్లో చదివిన తర్వాత కూడా వారి ఆదాయం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల జీతంకన్నా తక్కువే.
సమాజంలో వేద విద్యకు ఎలాంటి గౌరవమూ, గుర్తింపు ఇస్తున్నారో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. అర్చక వృత్తితో కుటుంబాన్ని పోషించుకోలేక పూజారులు దేవాలయాలకు తాళాలు వేసి వృత్తికి స్వస్తిపలికి వెళ్లి పోతున్న సంఘటనలు అసంఖ్యాకం. ఇక పౌరోహిత్యానికి ఎవరూ పిలవని రోజున ఆ కుటుంబం పస్తులుం డాల్సిందే. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో, హైదరాబాద్ చిక్కడపల్లి, ఇసామియా బజార్ వంటి చోట్ల మధ్యాహ్నం వరకు వేచి ఉండి, ఏ అవకాశమూ దొరక్క నిరాశతో ఇంటిముఖం పట్టే బ్రాహ్మణులను ప్రతిరోజూ చూడ వచ్చు. విజయవాడ, విశాఖపట్నం వంటి ఇతర నగరాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

భూమి హరించుకుపోవడంతో బ్రాహ్మణులు గ్రామా ల నుంచి పట్టణాలకు వలసపోయారు. ఫలితంగా గ్రామా ల్లో వారి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అక్కడక్కడ పూజారుల కుటుంబాలు మాత్రమే కనిపిస్తాయి. పట్ట ణాల్లో జీవన వ్యయం ఎక్కువ కాబట్టి, అత్యధిక బ్రాహ్మణ కుటుంబాలు చాలీచాలని వసతులతో బతుకులీడుస్తు న్నారు. చాలీచాలని ఇరుకు గదుల్లో కాపురం ఉంటు న్నారు. 69 శాతం పైగా బ్రాహ్మణ కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. అత్యధిక సంఖ్యాకులకు తెల్లరేషన్‌కార్డులు లేవు. ఆ కారణంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు లభించ టం లేదు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సకు నోచుకోవడం లేదు.

వైద్యంతోపాటు విద్యారంగం ప్రైవేటీకరణ చెందడం తో ఇక్కట్లు పాలవుతున్నది బీదవర్గాలే. తుపాను వస్తే ముందు కూలిపోయేది పూరిగుడిసే. దానిలో ఉండేవారు ఏ సామాజిక వర్గాలకు చెందినవారైనా కావచ్చు. గుడిసెలో బ్రాహ్మణులున్నంత మాత్రాన వారిని తుపాను వదిలి పెట్టదు. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ కళాశాలలు పెట్టు బడిదారీ వ్యవస్థ మరో వికృతరూపం మాత్రమే. కార్పొ రేట్ విద్య ఉక్కు చక్రాల కింద నలిగిపోతున్న సామాజిక వర్గాల్లో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. గతంలో ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నత విద్యనభ్యసించేవారు అధికంగా ఉండేవారు. కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వారి సంఖ్య గణనీయంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఉన్నత విద్యనభ్యసించాలంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకురా వాలి. అందుకు ఉన్నత ప్రమాణాలు గల సెకండరీ స్కూళ్లలో, జూనియర్ కాలేజీల్లో చదువుకోవాలి. అటాంటి విద్యా సంస్థల్లో చదువుకోగలిగిన స్థోమతలేని కారణంగా ఈ సామాజికవర్గం విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల మెట్లు ఎక్కలేకపోతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్, మెడి కల్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో బ్రాహ్మణ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ సామా జికవర్గం విద్యార్థుల్లో 50 శాతం మంది పదవ తరగతి స్థాయిలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు.

ఇతర బీదవర్గాలలో లాగే ఈ సామాజికవర్గంలో కూడా ఆడపిల్లల వివాహాలు సమస్యగా మారాయి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న కుటుంబాలలోని ఆడపిల్లలకు తల్లిదండ్రులు యుక్తవయస్సులో పెళ్లిళ్లు చేయలేకపోతు న్నారు. అనేకమంది యువతులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. రాష్ట్రంలో అవివాహిత యువతులు బ్రాహ్మణ సామాజికవర్గంలోనే ఎక్కువ. అలాంటి వారిలో కొందరు నిస్పృహకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. అవివాహిత బ్రాహ్మణ యువతుల నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకొని వారిని బలవంతంగా ఎత్తుకు పోయిన, మోసగించిన సంఘటనలు హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్నాయి. కుటుంబం పరువుపోతుందనే వ్యథతో తల్లిదండ్రులు అలాంటి సంఘటనలు జరిగిన ప్పుడు ఫిర్యాదు చేయడం లేదు. ఇది సామాజిక అంశమే అయినా దీని మూలాలు పేదరికం లోనే ఉన్నాయి.

పెళ్లిళ్ల విషయంలో మరో పార్శ్వం కూడా ఉంది. పౌరోహిత్యం చేసుకొంటున్న లేక అర్చకులుగా ఉన్న యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముం దుకు రావడం లేదు. వారి వేషభాషలు నచ్చడంలేదు. నామోషీ ఫీలవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోన్, శ్రీకా కుళం జిల్లా పాలకొండ గ్రామాలకు నేను వెళ్లినప్పుడు తమను పెళ్లి చేసుకోవడానికెవరూ ముందుకు రావడం లేదని అనేక మంది బ్రాహ్మణ యువకులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. అర్చకులుగా ఉన్న యువకులు ఆ వృత్తి వదిలేస్తే తప్ప తమకు పెళ్లికాదనే నిర్ధారణకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అర్చకులు కరువై దేవాలయాలు మూత పడే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి ఒకరు, ఆ ఉద్యోగాన్ని వదిలి అర్చకత్వంలోకి వచ్చినందుకు భార్య విడాకులిచ్చి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది.

ఈ సామాజిక వర్గంలో వితంతువులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అటువంటి వారికి అధికార యం త్రాంగం పెన్షన్లు ఇవ్వడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వాధికారి ఒకరు నేను ఎంతగా చెప్పి చూసినా ఏవో కుంటిసాకులు చూపి ఒక బ్రాహ్మణ వితంతువుకు పెన్షన్ నిరాకరించాడు. ఇళ్లలో పనిచేసుకొని కొందరు వితంతు వులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిన్న పట్టణాలలో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు. చాలీచాలని ఆదాయంతో చిన్నపిల్లలను పెంచటం, చదివించటం వారికి దుర్భరంగా మారింది.

బ్రాహ్మణులు యూరోపియన్ దేశాలలోని యూదు లవలె శాపగ్రస్తులుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. గతంలో బ్రాహ్మణులు దురహంకారంతో ప్రవర్తించి ఉండవచ్చు. మిగిలిన కులాల మీద దాష్టీకాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. పూర్వీకుల అపరాధాలకు నేటి తరాన్ని బాధ్యులను చేయ డం భావ్యం కాదు. బ్రాహ్మణ సామాజికవర్గంలోని చెడు పోకడల మీద, ఆ సామాజికవర్గానికి చెందిన వారే తిరుగు బాటు చేశారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గురజాడ అప్పారావు, మాడపాటి హను మంతరావు వంటి మహనీయులు ఆ కుటుంబాల్లో సంస్క రణలు తెచ్చారు. విజయవాడలో ప్రభాకర ఉమామ హేశ్వర పండితులు 20వ శతాబ్దం తొలినాళ్లలో అస్పృ శ్యతా నివారణకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. సమా జాన్ని మేల్కొలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ‘తలారులు’ ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులే. అండమాన్ జైల్లో నరకయాతనలను అనుభ వించిన 500 మంది స్వాతంత్య్ర పోరాటయోధుల్లోనూ సగానికి సగం వారే.

హిందూ మతంపై కత్తికట్టిన వారు బ్రాహ్మణుల మీదే గురిపెడుతున్నారు. దీన్ని మించిన అసంబద్ధత మరొకటి లేదు. హిందూయిజం ఏ సామాజికవర్గం సొంతాస్తి కాదు. బ్రాహ్మణులు నశిస్తే అది అంతరించదు. వివేకానందుడు, అరవిందుడు, రామకృష్ణ మిషన్‌లోని సన్యాసులు బ్రాహ్మ ణ సామాజికవర్గానికి చెందిన వారు కాదు. మనుస్మృతి పేరు చెప్పి బ్రాహ్మణ సామాజికవర్గాన్ని చిన్నచూపు చూడ టం, వారిపై అప్రకటిత యుద్ధాన్ని సాగించడం తగనిపని. ఈనాడు మనుస్మృతి అమలులో లేదు. భారత రాజ్యాం గంలో మనుస్మృతి అంతర్భాగం కాదు. ఇది అందరికీ తెలిసిందే.
బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న వాస్తవ స్థితిగతులు వెలుగులోకి రావలసిన అవసరం ఉంది. అందుకు గాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్‌ను నియమించాలి. సమాజంలోని ఏ వర్గమూ ఉపేక్షకు గురికాకూడదన్నదే మన రాజ్యాంగ స్ఫూర్తి.