'అందరికీ ఆహారo!'.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఆహార బద్రత చట్టం అందరికీ అన్నంపెట్టే రైతుకే శాపంగా మారిందా? వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ప్రస్తుతం మార్కెట్‌లో అన్నదాత పండించిన ధాన్యానికి మద్దతు ధర పలకక పోవడానికి, కొనుగోళ్లు ముందుకు సాగకపోవడానికీ.. కేంద్ర ప్రభుత్వం త్వరలో తేనున్న ఆహార భద్రత చట్టానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది! ఈ నిజాన్ని అంగీకరించేందుకు సాహసించని ప్రభుత్వం, నాయకులు, మిల్లర్లు... అంతా కలిసి రైతులతో ఆడుకుంటున్నారు. వారిని ఒక విష వలయంలోకి నెట్టేశారు. చట్టం చట్రంలో బంధించారు.
దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో సుమారు 6 వేల రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో నాలుగు వేల మంది ధాన్యం సేకరణ చేపడతారు. ఇదో శక్తిమంతమైన లాబీ! రాష్ట్రంలో లెవీ బాధ్యతను ప్రభుత్వం మిల్లర్లపైనే పెట్టింది. ఇప్పుడు.. రబీలో పండిన ధాన్యం కొనుగోళ్లు మందగించడానికి మిల్లర్లే కారణమయ్యారు. 'ధాన్యం ఎందుకు కొనరు?' అని ప్రశ్నిస్తే... 'ఇప్పటికే కొన్న ధాన్యం మా వద్ద మూల్గుతోంది. కొత్తగా ఎందుకు కొనాలి? ఎలా కొనాలి?' అనే వాదన వినిపిస్తున్నారు.
'మా దగ్గర ఉన్న బియ్యం ఎగుమతికి అనుమతిస్తే, మీ దగ్గరున్న ధాన్యం కొంటాం' అని మెలిక పెడుతున్నారు. 2008 వరకు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నారు. బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో స్థానిక మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. దీంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. మన బియ్యానికి విదేశాలలో భారీ డిమాండ్ ఉంది. ప్రధానంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన లక్షల మంది భారతీయులు మన బియ్యాన్నే తెప్పించుకుంటారు. ఇప్పుడు ఎగుమతులకు గేట్లు ఎత్తితే మిల్లర్లకు కాసుల వర్షం కురవడం ఖాయం!
అదేసమయంలో... ధాన్యం ధరలు కూడా పెరిగే అవకాశముంది. కానీ, బియ్యం ఎగుమతులకు కేంద్రం ససేమిరా అంటోంది. ఆహార మంత్రి శరద్ పవార్ నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరిదీ అదే మాట! వచ్చే వర్షాకాల సమావేశంలో కేంద్రం ఆహార భద్రత చట్టాన్ని తీసుకురానుంది. దీని ప్రకారం ప్రతి కుటుంబానికి తెల్లకార్డుపై 35 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ఆ మేరకు బియ్యాన్ని నిల్వ చేయకపోతే... చట్టం చట్టుబండలవుతుంది. ఎగుమతులకు అనుమతిస్తే స్థానిక మార్కెట్లో ధరలు భగ్గుమంటాయి. ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్రం బియ్యం ఎగుమతులకు ససేమిరా అంటోంది.
అన్నీ కొర్రీలే...
బియ్యం ఎగుమతులకు కేంద్రం అంగీకరించకపోవడంతో... మిల్లర్లు ఆ కోపాన్ని రైతులపై చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. రబీలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి లెక్కలు చూపించి మాయాజాలం చేస్తున్నారు. కనీస మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ధాన్యం సేకరణపై పర్యవేక్షణకు నియమించిన సీనియర్ ఐఏఎస్‌లు వచ్చినప్పుడు మాత్రం మిల్లర్లు హడావుడి చేస్తున్నారు. అప్పుడైనా సక్రమంగా కొంటున్నారా అంటే అదీ లేదు. తేమ శాతం అధికంగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారు. ర్యాకులు లేవని, గోనె సంచుల కొరత ఉందని రకరకాల సమస్యలు తెరపైకి తెస్తున్నారు.
ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు వెయ్యి, 'ఎ' గ్రేడ్‌కు 1030 రూపాయల వంతున మద్దతు ధర నిర్ణయించినా... ఇది ఎక్కడా అమలు కావడంలేదు. మిల్లర్లు 800 నుంచి రూ.850లకు మించి చెల్లించడంలేదు. రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని చెబుతున్నప్పటికీ ఇప్పటికి కేవలం 33 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగసంస్థలైన పౌరసరఫరాల కార్పొరేషన్, ఐకేపీ, ఎఫ్‌సీఐ కలిపి ఎనిమిది లక్షల టన్నులు కొనగా, మిల్లర్లు 25 లక్షల టన్నులు కొన్నారు.