Total Pageviews

Tuesday, February 1, 2011

కే.చీ.ఆర్. కు సీమాంధ్ర నాయకుల పార్శిల్


సీమాంధ్ర బిర్యాని పేడ అని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు గుంటూరులో విన్నూత్న రీతి లో నిరసన తెలిపారు.
బిర్యాని ఒకసారి తింటే దాని రుచి కేసిీఆర్‌కి తెలుస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గుంటూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్‌కు పార్శిల్ పంపారు. అనంతరం సమైక్యాంధ్ర నేతలకు, మీడియా ప్రతినిధులకు బిర్యాని రుచి చూపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండి హిదాయత్ మాట్లాడుతూ కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర మైనార్టీల సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారన్నారు. తక్షణం కేసి ఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్పీ నాయకులు క్రోసూరి వెంకట్ మాట్లాడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్‌కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ అన్నం మెతుకులు కిందపడితే కళ్లకు అద్దుకొని తింటామని, కేసిీఆర్ దాగుడు మూతలు ఆపాలని కోరారు.

డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు యరమాల విజయ్ కిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు. సీమాంధ్రుల ఓర్పు, సహనం, శాంతిని పరీక్షించవద్దన్నారు. కేసిీఆర్‌ది రాజకీయ డ్రామ అని, పదవుల కోసమే నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా జెట్టి ఝాన్సీ రాణి ఆలపించిన 'రగిలింది తెలుగు తేజం, కదిలింది సమైక్య వాదం' అనే గీతం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ అబ్దుల్ బాసిద్, ఎండి ఇంతియాజ్, కనపర్తి శ్రీనివాసరావు, పి రీయాజ్ ఖాన్, బొట్ల బ్రహ్మం, ఎండి సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ సెంటర్లో దొంగతనం

గుంటూరు నగరంలో జన సమర్థంగా ఉండే మార్కెట్ సెంటర్‌లో దోపిడీ దొంగ బీభత్సం సృష్టించటం సంచలనం రేపింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇరువురు పాత ఇనుము వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేసి రూ. 6.50 లక్షలు ఉన్న రెండు బ్యాగులతో ఉడాయిస్తున్న దోపిడీ దొంగను స్థానికులు వెంటాడిపట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళుతుండగా వారిని నెట్టేసి దొంగ పరారయ్యాడు. దీంతో వారు వెంటాడి మళ్లీ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

ఈ దాడిలో అబ్దుల్ కలాం అనే వ్యాపారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి ప్రాంతానికి చెందిన మౌలాలి, అద్దంకికి చెందిన అబ్దుల్ కలాంలు పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారు. పాత ఇనుము కొనుగోలు చేసి మార్టూరులోని ప్యాక్టరీకి తరలిస్తుంటారు. అయితే విద్యానగర్‌లోని వ్యాపారి వద్ద మంగళవారం రాత్రి మౌలాలి రూ. 3.50 లక్షలు, అబ్దుల్ కలాం రూ. 3 లక్షలు తీసుకొని రెండు వేర్వేరు బ్యాగుల్లో ఆటోలో బయల్దేరారు. మార్కెట్ సెంటర్‌లో దిగి బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే దోపిడీ దొంగ ఒక్కసారిగా వారి కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు పాత కక్షల నేపథ్యంలో దాడి జరుగుతుందని భావించారు.

ఈ దాడిలో అబ్దుల్ కలాం తలకు రెండు చోట్ల బలమైన గాయాలై పడిపోయాడు. అయినప్పటికీ బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో దొంగ బలవంతంగా ఇరువురి వద్ద ఉన్న బ్యాగ్‌లను గుంజుకొని పరారయ్యాడు. దీంతో వ్యాపారులు దొంగ, దొంగ అని కేకలు వేయటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటపడి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నంజుండప్ప, కొత్తపేట రక్షక్ వాహనం, లాలాపేట బ్లూ కోల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కలాంను 108లో జీజీహెచ్‌కు తరలించారు. కాగా ఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తూ దొంగ పడిపోయాడు. దీంతో స్థానికులు ఆటోలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన తరువాత దొంగ ఒక్కసారిగా కానిస్టేబుల్ అంబేద్కర్ (పీసీ 645), రక్షక్ ్రడైవర్ అన్వర్ బాషాలను కట్టేసి దొంగ మళ్ళీ పరారయ్యాడు.

దీంతో వారు పట్నంబజారు బంగారపు కొట్ల వరకు పరిగెత్తి దొంగను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు టీవీ నాగరాజు, డి కోటేశ్వరరావు, సీఐ మధుసూదనరావు తదితరులు స్టేషన్‌కు చేరుకొని పట్టుబడిన దొంగను విచారిస్తున్నారు. తెనాలికి చెందిన రఫీగా గుర్తించినట్లు సమాచారం. గతంలో అతనిపై ఉన్న కేసులు ఇంకా ఏమైనా వెలుగు చూడని నేరాలకు పాల్పడ్డాడా అనేదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గత పది రోజుల క్రితం కూడా మార్కెట్ సెంటర్‌లో కారులో వెళుతున్న వ్యాపారుల సూట్‌కేస్‌ను కూడా ఇదే విధంగా గుంజుకొని పరిగెత్తుతుండగా స్థానికులు వెంటపడి పట్టుకొని దొంగను దేహశుద్ధి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అప్పుడు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

స్థానికుల స్పందనకు ప్రశంసలు
దోపిడీ చేసి పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న స్థానికులు ప్రశంసలు అందుకున్నారు. ఏ మాత్రం భయపడకుండా వారు దొంగను పట్టుకొని అప్పగించటం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇదే విధంగా స్థానికులు తమ వంతుగా సహకరిస్తే నేరాలను అరికట్టటం సులువు అవుతుందని వారు అంటున్నారు. అదేవిధంగా పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్ అంబేద్కర్, ్రడైవర్ అన్వర్ బాషాతో పాటు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సురేష్ (పీసీ 2823), సుభాని (పీసీ 2589)లను అదేవిధంగా సహకరించిన స్థానిక యువకుడు వినోద్‌కుమార్‌లను పోలీసు అధికారులు అభినందించారు.

Monday, September 13, 2010

తెలంగాణా లో జరుగుతున్న పరిణామాలు


ఈటేవల తెలంగాణా లో జరుగుతున్న పరిణామాలు తెలంగాణా వాదాన్నే సమాధి చేసే టట్టు కనపడుతున్నాయి. ఉద్యమం అతివాద తీవ్రవాద రూపు దలుస్తున్దన్నట్లు కనిపిస్తుంది. తెరాస తప్ప మిగత రాజకీయ పార్టి నేతలను రోడ్ల ఫై తిరగానీయము వారి పై దడి చేస్తాము అని డిసెంబర్ ౩౧ తరువాత సునామి భూకంపాలు వస్తాయనే కెసిఆర్ వ్యాఖ్యలు చూస్తే ఒక కాశ్మీర్ ఒకప్పటి పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆంధ్ర లో తీవ్రవాద పోకడలు ఇలాగే కొనసాగితే కేంద్రం ఊరుకొంటుంద లేక కలిస్తాన్ ఉద్యమం లా అనిచివేయ్యద వీటన్న్తికి స్టూడెంట్ జాక్ సమాధానం చెప్పాలి కెసిఆర్ కి పొయ్యేది ఈమి లేదు బలి అయ్యేది విద్యార్ధులే. విద్యార్ధులు విద్యార్ధి నాయకులు జరా సొంచయించండి!!!!
పొత్తూరి శ్రీనివాస్
సంపాదకులు సత్యాగ్రహం వీక్లీ

Tuesday, July 20, 2010

telugutammula veera agraham


మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు అర్రెస్ట్ ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ములు ఆందోళన చెయ్యటం న్యాయమే కాని హర్షించా తగినది కాదు అని పలువురు అబిప్రాయా పడుతున్నారు. అహింసా మార్గము లో బాబ్లి ని సందర్సిన్చాతానికి వెళ్ళాను అని చంద్ర బాబు చెబుతున్నారు. అయన అర్రెస్ట్ ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్ళు హింస మార్గం లో నిరసన తెలియ చేస్తూ నగరం లోని పోస్ట్ ఆఫీసు మరియు టెలిఫోన్ కార్యాలయం తగుల పెట్టారు. దీని వెనుక ముందస్తు ప్రణాళిక వున్నట్లు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

Friday, June 5, 2009

ill legal vs im moral


చట్ట విర్రుదానికి నైతికంగా విరుద్ధనికి మధ్య గీత లేక పోవడమే సమజని పీడిస్తున్న పెద్ద ర్గ్మత . ఉదాహరణకి లంచం అనేది ఇల్లెగల్, వభిచారం ఇమ్మొరల్ .కాని వభిచారం కూడా చట్ట వయతిరేకమిన నేరమ్ గ పరిగణన పొందుతోంది. ఇతేయ్ దీనికి ఉద్దేశించిన చట్టం పేరు ప్రేవెంషన్ అఫ్ ఇమ్మొరల్ ట్రాఫిక్ ఆక్ట్. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నీరమే. అలాగే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమె. అయిన ఆచరణలో లంచం కాని కట్నం కానీ తీసుకోవడం మాత్రమె నేరమ్గ భావిస్తున్నాం. విషయం చట్టం లో ఇంత స్పష్టంవున్నపటికి చట్టని కాపాడాల్సిన బాధ్యత ను భుజాల కేత్తుకున్న వారెవరు దీని పై దృష్తి పెట్టిన ధకలలు లేవు.

ఇక వభిచారం విషయానికి వొస్తెయ్ ముందుగ అది అనియితికమా అక్రమామ రెండు కాక చట్ట విరుద్ధమ అనేది తేల్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అది కేవలం అనేఇతికం అందుకే సంబంధిత చట్టాలు PITA అన్నారు.ఆ త్రరువాత అది చట్ట విర్రుధం అయ్యింది. అయినప్పటికి చట్టని మార్చలేదు. మార్చనతవరకు అది అన్నైతికం గానే వుంటుంది. అటువంటి పరిస్థితులలో ఆ వ్యవహారాని ఎదుర్కునే అధికరారం హక్కు బాధ్యత సమాజం అంతటికి లభిస్తుంది. అప్పుడు .... 'చట్టం అందరి చేతులోకి పోతుంది" ఈ విపరినమ్మని అడ్డుకోవలిని అనుకొంటే చట్టని మార్చి "prevention of prostitution or Flush trade Act" తేఅవాలి.

P.V.R.Gopinath

Senior journalist

Thursday, March 5, 2009

కీ ఇవ్వనున్న జయలలిత


నగరానికి చెందిన సినిమాతార జయలలిత తాజా గ "కీ" అనే సందేసాత్మక చిత్రాని నిర్మించారు. ఆత్మహత్యలు పెరిగిపోథున్న ప్రస్తుత పరిస్థితులలో వాటి నివారణ ఎక్కడో లేదు మన చేతుల్లో నే వుంది అన్నది ఈ చిత్రం యొక్క సారాంశం. తనికెళ్ళ భరణి దర్సకత్వం వహించిన ఈ చిత్రం లో షఫీ ముఖ్య భూమిక పోషించారు. సిరా తో అంతర్జాతియ విమర్శకుల నుంచి ప్రసంసలు అందుకొన్న భరణి ఈ చిత్రం తో ఎన్ని సంచలనాలు సృష్టిస్టారో చూడాలి. నిర్మాత గ తనకి ఎంతో తృప్తి నిచ్చిన ఈ చిత్రాని త్వరలొనే విడుదల చేస్స్తానని జయలలిత తెలిపారు.

Sunday, March 1, 2009

నిజమైన కధనం


గుంటూరు జిల్లా కలెక్టర్ బదిలీ విషయం లో మనం ఉహిన్చిన్దే జరిగింది. కొత్త కలెక్టర్ గ జయేష్ రంజన్ బాధ్యతలు స్వీకరించడానికి నగరానికి బయలుదేరినట్లు తెలిసింది. నగరానికి వొస్తున్న కొత్త కలెక్టర్ కి గరం గరం గుంటూరు హార్దిక స్వాగతం పలుకుతుంది. మనస్తత్వ శాస్త్ర నిపుణులైన జయేష్ రంజన్ జిల్లా రాజకీయ నాయకులను ఎంత వరకు మెప్పించ గలరో వీచి చూదాం.