అయినవాళ్ళకు ఆకులలో కానివాళ్ళకి కంచాలలో
ఇది మన రాష్ర్టప్రభుత్వతీరు
ఓకప్రక్కవిశాఖ ఉక్కు ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలులేక పస్తులుంటూ,పిల్లల్ని చదివించలేక,వృద్దులకు వైద్యం అందించలేక,పెళ్ళిళ్ళు అపుకొని చావుకి బ్రతుకుకి మధ్య ఊగిసలాడుతుంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అనకాపల్లి మిట్టల్ స్టీలులో కొత్తగా తీసుకునే ఉద్యోగులకు స్కిలుడెవలప్ మేంట్ రాయితి కింద ₹6000@20000 అద్యోగస్తులకు ఐదుఏళ్ళు ఇస్తుందట వేరసి ₹720కోట్ల సంతర్పణ
మరి మిట్టల్ లోని ఆ మీటా ఏమిటో మనలోని ఆ కారా ఏమిటో ఆ చంద్రునికే ఏరుక
7.5 మి.ట ఉత్పత్తికి కావల్సిన 35మిలియన్ గాలన్ల/డే (MGD)కుగాను విశాఖ దగ్గర 24 MGD ఉంది ఓక్క 11MGD ఇవ్వండి మహాశేయా అంటే పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇప్పుడు మిట్టలుకు మాత్రం కిలో లీటరు నీరు ( KL) ₹ 50 కి ఇస్తోంది అదే మిగతా పరిశ్రమలకు అయితే KL ₹120 అంటే మిట్టల్ 7.5 మి.ట ఉత్పత్తికి అవసరమైన నీటి పై ప్రభుత్వం ఇస్తున్న నీటి రాయితి అక్షరాల 5050 కోట్లు 15సంవత్సరాలకి
ఇక్కడ విశాఖ ఉక్కు ఉద్యోగులను కన్నీటిలో ముంచి అక్కడ ఈ నీటిసాయమేంటో ఏలినవారికే ఏరుక
విశాఖ ఉక్కు, మేము చచ్చిపోతున్నాం మహా ప్రభో మమ్మల్ని కాపాడండి అంటే, ₹500 కోట్లు సాయం ఇచ్చినట్టే ఇచ్చి చచ్చిన శవాన్ని పీక్కుతినే రాబందులాగా కేంద్రం దానిని జియస్టి బకాయలుకింద జమచేసింది
అదే మిట్టల్ మహాసేయుడికి మాత్రం రాష్ట్రవాట జియస్టి 7.5 మి.ట మీద ప్రతీఏటవచ్చే @18% జీయస్టీ 4వేలకోట్లు 15 సంవత్సరాలు మాఫీ అంట
వెరసి 60వేలకోట్ల గుటకాయస్వాహ మరీ దీనిలో మనపాలకులకేం దక్కుతుందో?
దాతలు ఇచ్చినభూమీలో కట్టిన విశాఖ ఉక్కుని అమ్మి ఆ భూములు సొమ్ముచేసుకుందాం అనుకునే ఈ ప్రభుత్వం పాపం పేద మిట్టల్ గార్కి ఏకరా 2కోట్లు ఖరిదుచేసే భూమిని కేవలం ₹51లక్షలకు పొర్టుభూమితో కలిపి 4000 ఏకరాలు పకట్టబెట్టి మన ప్రభుత్వం తన దాతృత్వాన్ని చాటిచెప్పింది దీనికి మనకయిన బొక్క అక్షరాల ₹600కోట్లు
విశాఖ ఉక్కువారు మాకు మైన్సఇవ్వండి మహప్రభో మా బతుకు మేము బతుకుతాం అంటే పట్టించుకోరు కాని మిట్టల్ మహాశేయుడికి మాత్రం మైన్స ఇస్తారు,ప్రభుత్వం ఖర్చతో నీటివసతి,రోడ్లు సకల హంగులు
మరి మిట్టల్ మనరాష్ట్ర అల్లుడు కదా ధూ వీళ్ళ బతుకులు చెడ ఇవికాక స్టాంపుడ్యూటిలు లేవు,రిజిస్ర్టేషన్ ఫీసులులేవు,
మిట్టల్ వారిసేవలో ఓక ప్రత్యేక అధికారి ఏన్నో ఏన్నేన్నో వీటన్నికన్నా హైలేట్, మిట్టల్ వారు పెట్టే ₹40వేల కోట్ల మూలధనంలో 50% అనగా ₹20వేలకోట్లు 7.5మి.ట ఉత్పత్తి మొదలుకాంగానే మన చల్లనిచూపుల చంద్రుని ప్రభుత్వం తిరిగి మిట్టల్ దొరగారికి ఇస్తుంది అదే విశాఖ ఉక్కు ఉద్యోగులు మాత్రం జీతాలకు ఓక వేయ్యకోట్లు అడిగితే మాత్రం డబ్బులుండవు.
వెరసి మొత్తంగా మిట్లల్ దొరగారు పెట్టే ₹40వేల మూలధనానికి(ల్యాండు ఖరీదు తీయంగా),వచ్చే 20,000 ఉద్యోగాలకి మన మన బాబుగారు మిట్టల్ బాబుగారి ఇచ్చే సంతర్పణ ₹90,000కోట్లు దీనికన్నా ప్రతినిరుద్యోగికి కోటిరూపాయలు ఇస్తే సంతోషంగా 90000నిరుద్యోగులు బతుకుత్రేమొ అరే మరచా అలా చేస్తే మీకు ఫండింగు రాదుగా సారీ
కొసమెరుపు ఏంటంటే ఇంత దోపిడి జరుగుతున్నా ఇప్పటి దాకా నొరువిప్పుకుండా,విశాఖ ఉక్కు యూనియన్లు తమ నిజాయతిని నిరూపించుకున్నాయి గద్దేలేకపోతే ఏడుస్తాడు,ఏక్కితే మనల్ని ఏడిపిస్తాడు
ఇది పారిశ్రామిక విధానమా లేక దోపిడికి సోపానమా మీరే నిర్ణయించండి ప్రజలారా
జగన్ బాబు ఏక్కడ నిద్రపోతున్నా,లే యుద్దంచేయి అప్పుడు ప్రజలే ఇస్తారై ప్రతిపక్షహోదా,మోడీ అంటే భయమా
అయితే బజ్జో పవనా సనాతన ధర్మంలో ఈ పనులు చేయచ్చా జస్టతెలియక ఆడిగా
Good analysis
ReplyDeleteConclusion is super
ReplyDelete