Total Pageviews

Showing posts with label కోడెల. Show all posts
Showing posts with label కోడెల. Show all posts

Tuesday, February 24, 2009

కోట సైదయ్య కి ఘాటైన అవమానం

శివరాత్రి సందర్బంగా కొట్టపకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో నరసరావుపేట మాజీ ఎమ్పే కోట సైదయ్య కి దారుణమైన అవమానం జరిగింది. మాజీ మంత్రి, కోడెల శివ ప్రసాద్ తన అనుచరులైన కొంత మంది రౌడి శీటర్లతో దివా దర్సనకి వొచ్చారు. అప్పటికే క్యూ లో లక్షలాది మంది భక్తులు వేచివున్నారు. అయినప్పటికీ కోడెలను ముఖద్వారంగుండా లోనికి అనుమతించారు అక్కడి పోలీసులు. అయితే తమ నాయకుడి తో తమనుకూడా లోపలికి అనుమతించాల్సిందే అంటు అనుచరులు పట్టు పట్టారు. దీనితో పేద ఎత్తున థోపులత జరిగింది. ఈ సందర్బంగా దైవ దర్శనానికి వొచ్చిన కోట సైదయ్య ను అక్కడే వున్నా పోలీసులు తోసివెసారు. తానూ ఆ ప్రాంత మాజీ ఎమ్పీ అని ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ని బ్రతిమిలాడుకొని దర్శనం చేసుకొన్నారు. ఈ సంగటన చూసిన భక్తులు "కర్ర ఉన్న వాడిదే బర్రె " అనుకొన్నారు.