Total Pageviews

Saturday, December 14, 2024

ఎవరి కొసం ఈ రీసెట్లెమెంట్? ఆమరావతి రైతులను మరో సారి ముంచుతున్న ప్రభుత్వం!!!  

సిఆర్‌డిఏ పరిధిలో ప్రభుత్వం తీసుకొచ్చిన రీసెటిల్‌మెంట్‌ పాలసీ డ్రాఫ్ట్‌పై  రైతుల్లో కలకలం రేపింది. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శుక్రవారం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా రీసెటిల్‌మెంట్‌ పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్‌ను లోతుగా పరిశీలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు భూములు తీసుకునే విషయమే అయితే పూలింగు, లేదా నెగోషియబుల్‌ పాలసీ ఉందని, కొత్తగా రీసెటిల్‌మెంట్‌ విధానం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రీసెటిల్‌ అంటేనే నివాస ప్రాంతాన్నిగానీ, లేదా ప్రజలను గానీ వేరే ప్రాంతానికి తరలించడమేనని, ప్రస్తుతం రాజధానిలో ఎవరిని తరలించడానికి ఈ పాలసీని తీసుకొచ్చారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీనిపై సిఆర్‌డిఎ అధికారులు ఇప్పటి వరకూ కనీస చర్చ కూడా పెట్టలేదని పలువురు ప్రజాశక్తికి తెలిపారు. ఇప్పటికే భూములన్నీ ఇచ్చేశామని, రైతులకు వచ్చిన ప్లాట్లనూ ప్రాజెక్టుల కోసం తీసుకుంటే, అంతే భూమిని వేరేచోట ఇస్తామనే విధంగా పాలసీలో పొందుపరిచారని, అంటే ఎక్కడో సుదూరంగా ఇస్తే ఎలా అని వారు అడుగుతున్నారు. ఇంత అర్జంటుగా సెటిల్‌మెంట్‌ పాలసీ ఎందుకు తెచ్చారో కూడా చెప్పడం లేదని, బహిరంగ చర్చలో చెప్పేటట్లయితే ముందుగానే వారనుకున్న నిర్ణయాలు చెప్పేసి ఆమోదించినట్లు రాసుకుంటారని, దీనివల్ల రైతులకు, రాజధాని ప్రజలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం వారిలో ఉంది.

కొత్తగా ఏర్పాటు చేసే రోడ్లు, రైలు మార్గాలు, అంతర్జాతీయస్థాయిలో ప్రైవేటు డెవలపర్లకు ఇచ్చే ప్రాజెక్టులు రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్లలోనే ఉంటాయని, వాటిని తీసుకోవడం, ఎక్కడైనా గ్రామాల్లో అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించడం వంటి పనుల కోసమే దీన్ని తెచ్చారని అంటున్నారు. అదే జరిగితే కొందరు సర్వం కోల్పోతారని, అది ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం కోసం తాము పోరాడామని, ఇప్పుడు తమకోసం తాము పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ప్రపంచబ్యాంకు షరతుల ప్రకారం ఈ విధానాన్ని తీసుకురావడమంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని అంటున్నారు.

Wednesday, December 4, 2024

 అయినవాళ్ళకు ఆకులలో కానివాళ్ళకి కంచాలలో


ఇది మన రాష్ర్టప్రభుత్వతీరు


ఓకప్రక్కవిశాఖ ఉక్కు ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలులేక పస్తులుంటూ,పిల్లల్ని చదివించలేక,వృద్దులకు వైద్యం అందించలేక,పెళ్ళిళ్ళు అపుకొని చావుకి బ్రతుకుకి మధ్య ఊగిసలాడుతుంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అనకాపల్లి మిట్టల్ స్టీలులో కొత్తగా తీసుకునే ఉద్యోగులకు స్కిలుడెవలప్ మేంట్ రాయితి కింద ₹6000@20000 అద్యోగస్తులకు ఐదుఏళ్ళు ఇస్తుందట వేరసి ₹720కోట్ల సంతర్పణ

మరి మిట్టల్ లోని ఆ మీటా ఏమిటో మనలోని ఆ కారా ఏమిటో ఆ చంద్రునికే ఏరుక


7.5 మి.ట ఉత్పత్తికి కావల్సిన 35మిలియన్ గాలన్ల/డే (MGD)కుగాను విశాఖ దగ్గర 24 MGD ఉంది ఓక్క 11MGD ఇవ్వండి మహాశేయా అంటే పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇప్పుడు మిట్టలుకు మాత్రం కిలో లీటరు నీరు ( KL) ₹ 50 కి ఇస్తోంది అదే మిగతా పరిశ్రమలకు అయితే KL ₹120 అంటే మిట్టల్ 7.5 మి.ట  ఉత్పత్తికి అవసరమైన నీటి పై ప్రభుత్వం ఇస్తున్న నీటి రాయితి అక్షరాల 5050 కోట్లు 15సంవత్సరాలకి 


ఇక్కడ విశాఖ ఉక్కు ఉద్యోగులను కన్నీటిలో ముంచి అక్కడ ఈ నీటిసాయమేంటో ఏలినవారికే ఏరుక

విశాఖ ఉక్కు, మేము చచ్చిపోతున్నాం మహా ప్రభో మమ్మల్ని కాపాడండి అంటే, ₹500 కోట్లు సాయం ఇచ్చినట్టే ఇచ్చి చచ్చిన శవాన్ని పీక్కుతినే రాబందులాగా కేంద్రం దానిని జియస్టి బకాయలుకింద జమచేసింది

అదే మిట్టల్ మహాసేయుడికి మాత్రం రాష్ట్రవాట జియస్టి 7.5 మి.ట మీద  ప్రతీఏటవచ్చే @18% జీయస్టీ 4వేలకోట్లు 15 సంవత్సరాలు మాఫీ అంట 

వెరసి 60వేలకోట్ల గుటకాయస్వాహ మరీ దీనిలో మనపాలకులకేం దక్కుతుందో?

దాతలు ఇచ్చినభూమీలో కట్టిన విశాఖ ఉక్కుని అమ్మి ఆ భూములు సొమ్ముచేసుకుందాం అనుకునే ఈ ప్రభుత్వం పాపం పేద మిట్టల్ గార్కి ఏకరా 2కోట్లు ఖరిదుచేసే భూమిని కేవలం ₹51లక్షలకు పొర్టుభూమితో కలిపి 4000 ఏకరాలు పకట్టబెట్టి మన ప్రభుత్వం తన దాతృత్వాన్ని చాటిచెప్పింది దీనికి మనకయిన బొక్క అక్షరాల ₹600కోట్లు

విశాఖ ఉక్కువారు మాకు మైన్సఇవ్వండి మహప్రభో మా బతుకు మేము బతుకుతాం అంటే పట్టించుకోరు కాని మిట్టల్ మహాశేయుడికి మాత్రం మైన్స ఇస్తారు,ప్రభుత్వం ఖర్చతో నీటివసతి,రోడ్లు సకల హంగులు

మరి మిట్టల్ మనరాష్ట్ర అల్లుడు కదా ధూ వీళ్ళ బతుకులు చెడ ఇవికాక స్టాంపుడ్యూటిలు లేవు,రిజిస్ర్టేషన్ ఫీసులులేవు,

మిట్టల్ వారిసేవలో ఓక ప్రత్యేక అధికారి ఏన్నో ఏన్నేన్నో వీటన్నికన్నా హైలేట్, మిట్టల్ వారు పెట్టే ₹40వేల కోట్ల మూలధనంలో 50% అనగా ₹20వేలకోట్లు 7.5మి.ట ఉత్పత్తి మొదలుకాంగానే మన చల్లనిచూపుల చంద్రుని ప్రభుత్వం   తిరిగి మిట్టల్ దొరగారికి ఇస్తుంది అదే విశాఖ ఉక్కు ఉద్యోగులు మాత్రం జీతాలకు ఓక వేయ్యకోట్లు అడిగితే మాత్రం డబ్బులుండవు.

వెరసి మొత్తంగా మిట్లల్ దొరగారు పెట్టే ₹40వేల మూలధనానికి(ల్యాండు ఖరీదు తీయంగా),వచ్చే 20,000 ఉద్యోగాలకి మన మన బాబుగారు మిట్టల్ బాబుగారి ఇచ్చే సంతర్పణ ₹90,000కోట్లు దీనికన్నా ప్రతినిరుద్యోగికి కోటిరూపాయలు ఇస్తే సంతోషంగా 90000నిరుద్యోగులు బతుకుత్రేమొ  అరే మరచా అలా చేస్తే మీకు ఫండింగు రాదుగా సారీ

కొసమెరుపు ఏంటంటే ఇంత దోపిడి జరుగుతున్నా ఇప్పటి దాకా నొరువిప్పుకుండా,విశాఖ ఉక్కు యూనియన్లు తమ నిజాయతిని నిరూపించుకున్నాయి గద్దేలేకపోతే ఏడుస్తాడు,ఏక్కితే మనల్ని ఏడిపిస్తాడు

ఇది పారిశ్రామిక విధానమా లేక దోపిడికి సోపానమా మీరే నిర్ణయించండి ప్రజలారా

జగన్ బాబు ఏక్కడ నిద్రపోతున్నా,లే యుద్దంచేయి అప్పుడు ప్రజలే ఇస్తారై ప్రతిపక్షహోదా,మోడీ అంటే భయమా

అయితే బజ్జో పవనా సనాతన ధర్మంలో ఈ పనులు చేయచ్చా జస్టతెలియక ఆడిగా



Saturday, November 16, 2024

 


ద్రుక్పధం మర్చూకోని అధినేత ... దిక్కుతోచని కార్యకర్త.

గత ఎన్నిక్లలొ భారి మెజారిటి తొ గెలుపు సధించటం లొ జగన్ కష్టం  ఎంత ఉందో నిస్వార్ధంగా  కష్టపడ్డ కార్యకర్తల క్రుషి అంతకు మించి ఉంది. అధికరంలొకి వొచ్చిన తరువాత కొందరు భజంత్రిగాళ్ళు జగన్ చుట్టూ చేరి ఆ గెలుపును అనుభవించారు. సమాన్య కార్యకర్తకు కనీసం జగన్ దర్శనం దుర్లభమైనది. ఐనా కూడా కెవలం రాజ శేఖర్ రెడ్డి మీద పెంచుకొన్న ప్రేమ, జగన్ మీద ఉన్న అభిమానం తో ఎన్నికల్లొ పార్టి కోసం నెత్తురు చిందించినది సామన్య కారయకర్తలు మాత్రమె. ఎన్నికల ఫలితాల తరువాత ముఖం చాటేసిన సజ్జల ని ఇంకా నమ్మి కార్యకర్తలను దూరం చెసుకొవటం జగన్ అపరిపక్వ రజకీయ విధానం కి నిదర్శనం.  

ఒక పత్రిక లొ గ్రామీణ విలెఖరిగా జీవితం మొదలు పెట్టిన సజ్జల  అదికూడా సక్రమంగా చెయ్యలేక వాళ్ళు తీసివేశారొ లెక ఈయన రాజీనామా చేసారో అన్నది ఇప్పటికి భేతాళా ప్రశ్నగా మిగిలింది. రాజా రెడ్డి తొ ఉన్న పరిచయం మరియు దూరపు బంధుత్వం అడ్డం పెట్టుకొని చిన్న చిన్న పంచయితీలు చెస్తు మైనింగ్ కాంట్రక్టు సంపాధించి అనతి కల్లం లోనే ధనవతుదు ఐన వైనం జగన్ మరచిపొవటం చాలా బాధాకరం.

సాక్షి దిన పత్రిక సజ్జల వేలు పెట్టక ముందు ఎలా ఉందొ ముఖ్యంగా ప్రియదర్శని రాం ని వెళ్ళగొట్టిన తరువాత ఎలా తయారు అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా పెరు తో ప్రస్తుత అధికార కూటమి చెస్తున్న రచ్హ కి కారణం సజ్జల వారి పుత్ర రత్నం కాదా? పార్టిని బ్రశ్ఠు పట్టించిన సజ్జల లంటి వారికి యే నమ్మకం తొ కొత్త బాధ్యత అప్పగించరో అలొచించుకోవలి.