హిందువాదులు తరచుగా చెప్పే మాట తమ మతం పురాతనమైనది,మరియు ఎన్నో సంప్రదాయాలకు అలవాలమైనది అని. కానీ ప్రపంచం లో వేరే ఏ మతం లోను చూడని flexibility , adadoptability కేవలం హిందూ మతం లోనే కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి హిందూ దేవుడు ఎదో ఒక ఆహార పదార్ధం తో సంబంధం కల్గి ఉండి అది వారికి ఇష్టమైన నైవేద్యం గ సవీకరిస్తారు అని భక్తుల నమ్మకం. ఉదాహరణకి తిరుపతి లడ్డు,అయ్యప్ప రావణ పాయసం,అన్నవారు గోధుమ ప్రసాదం లాంటివి. ఇప్పుడు ఈకోవాలో సుబ్రమణ్య స్వామి కి ఇష్టమైన నైవేద్యం గా మంచ్ చేరింది. ఔను నెస్లే వారి మంచ్ . వివరాల్లోకి వెళితేయ్ కేరళ లోని చిమ్మేత్ శ్రీ బలముర్గం స్వామి దేవాలయం లో నివేదించేది మంచ్ చాక్లేట్లు మాత్రమే .ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ ఆలయం లో గుట్టలు గుట్టలు మంచ్ చాక్లేట్లు దర్శనం ఇస్తుంటాయి.
ఆలయ వర్గాల కధనం ప్రకారం సమీపం లో ఉండే ఒక ముస్లిం బాలుడు అస్వస్ధ కి గురి కాగా అతని తల్లితండ్రులు ఆ బాలుడి తో పూజ చెంయిచి దేవునికి ఏదైనా నివేదించామని చెప్పగా ఆటను తానూ తింటున్న మంచ్ చాలట ఇచ్చాడనీ, అతని జబ్బు నయం అవ్వటం తో అందరు అదే నివేదిస్తున్నారని తెలిసింది. సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం కేవలం 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తో దెస వ్యాప్త ప్రాచుర్యం పొందటం గమనార్హం
No comments:
Post a Comment