Total Pageviews

Wednesday, February 25, 2009

డామిట్ !!!! కద అడ్డం తిరిగింది


జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు కి అనుకోని సంఘటన ఎదురుయ్యింది. తానూ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినది అన్నట్లు తన పిలుపు మేరకు వొచ్చిన జనం తనని తన్నినంత పని చేసారు. వివరాలోకి వెళ్తే బుధవారం నాడు చిలకలూరిపేట పట్టణం లో కొన్ని ఆటోల తో పుల్లారావు ప్రచారం నిర్వహించారు. దాని సారాంసం ఏమిటిఅనగ ప్రభుత్వం ఇటీవల పేదల నివేస స్థలాల కోసం నాలుగు కోట్ల రూపాయలతో 52 ఎకరాల స్థలమ్ కొన్నది. అది బుధవారం నాడు పంపిణి చేస్తారు అని స్థలం కావాల్సిన వారు MRO కార్యాలయంకి రావాలని. ఐతే ఈ ప్రకటన పుల్లారావు గారు అత్యుస్త్సాహం తో చేసిందీ. దీనికి MRO కి సంబంధం లేదు అని అక్కడికి చేరుకొన్న ప్రజలకు పోలీసులు చెప్పటం తో జనం పుల్లారావు ని అక్కడే ఉన్న నన్నపనేని రాజకుమారి ని బండ బూతులు తిట్టారు. అంతటి తో ఆగక వారిని అరెస్టు చెయ్యాల్సిందే అని పోలీసుల పై వొత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక పోలీసులు నాయకులని అరెస్టు చేసారు. ఈ సందర్భంగా అక్కడ వున్న వృద్ధుడు ఒకరు "ప్రత్తి రైతులను మోసగిద్దామని IP పెట్టటానికి ప్రయత్నించిన పుల్లారావు ని నమ్మి ఇంట మంది వొచ్చారు ఈ జనానికి బుద్ధి లేదు" అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన లో కొసమెరుపు ఏమిటంటే పుల్లరావుని విడుదల చేసిన పోలీసులు ప్రచారానికి ఉపయోగించిన ఆటో లని వోదలలేదు.

Tuesday, February 24, 2009

కోట సైదయ్య కి ఘాటైన అవమానం

శివరాత్రి సందర్బంగా కొట్టపకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో నరసరావుపేట మాజీ ఎమ్పే కోట సైదయ్య కి దారుణమైన అవమానం జరిగింది. మాజీ మంత్రి, కోడెల శివ ప్రసాద్ తన అనుచరులైన కొంత మంది రౌడి శీటర్లతో దివా దర్సనకి వొచ్చారు. అప్పటికే క్యూ లో లక్షలాది మంది భక్తులు వేచివున్నారు. అయినప్పటికీ కోడెలను ముఖద్వారంగుండా లోనికి అనుమతించారు అక్కడి పోలీసులు. అయితే తమ నాయకుడి తో తమనుకూడా లోపలికి అనుమతించాల్సిందే అంటు అనుచరులు పట్టు పట్టారు. దీనితో పేద ఎత్తున థోపులత జరిగింది. ఈ సందర్బంగా దైవ దర్శనానికి వొచ్చిన కోట సైదయ్య ను అక్కడే వున్నా పోలీసులు తోసివెసారు. తానూ ఆ ప్రాంత మాజీ ఎమ్పీ అని ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ని బ్రతిమిలాడుకొని దర్శనం చేసుకొన్నారు. ఈ సంగటన చూసిన భక్తులు "కర్ర ఉన్న వాడిదే బర్రె " అనుకొన్నారు.

కలెక్టర్ బదిలీ?

విశ్వసనీయ వర్గాల కధనం మీరకు జిల్లా కలెక్టర్ బె వెంకటేశం బదిలీ కానున్నారు. ఆయనను ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తుంది. ఇక గుంటూరు కి కలెక్టర్ గ రావడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నాటు సమాచారం. ముఖ్యంగా పర్యాటక శాక డైరెక్టర్ జయేష్ రంజన్ ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Thursday, February 12, 2009

అమ్మ గారి హృదయం విశాలమైనది.

మీకు తెలుసా !!!!!! ఎప్పుడో మదర్ తెర్రిసా తరువాత ఇప్పుడు మన గుంటూరు జిల్లా ప్రజా పరిషద్ చైర్పెర్సన్ కూచిపూడి విజయ అంత ఉదారత చూపిస్తునారు. అమ్మ గారి కి నచ్చితే చాలు ఏదైన ఇచ్చేస్తారు. నిజమండి బాబు నమ్మండి !!!! కావలి అంటే రవాణ శాక లో పని చేసే అమ్మ గారి కులస్థులైన సాగర్ మరియు ఆనంద్ లని అడగండి చెపుతారు. వాళు పని చేసిది రావాన శాక లో కాని అమ్మగారి "దయ" వల్ల జిల్లా పరిషద్ నివేశ సముదాయం లో వుంటారు. ఇసక రీచ్ ల దగ్గర రాదంతం చేసి నిజాయితి చాటు కోవటానికి విశ్వ ప్రయత్నం చేసిన విజయ దీనికి ఏమి సమాధానం చెపుతారో? కుల గజ్జి అణువు అనువున పాతుకు పోయి వుద్యోగులు కాని వారికి ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయిమ్చటం ఎంత వరకు సమర్ధనీయం? దీనికి ఆమె సమాధానం చెప్పి తీరాల్సిందే.