Total Pageviews

Friday, April 27, 2012

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం

 రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం పరిస్థితి అత్యంత దయనీ యంగా ఉంది. కర్ణాటకలో 55 శాతం బ్రాహ్మణ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉండ గా, మన రాష్ట్రంలో వాటి సంఖ్య 60 శాతం. దిగజారిపోతున్న ఈ సామాజికవర్గం స్థితిగతులను వివిధ సాంఘిక రాజకీయ వేది కల మీద ప్రస్తావించడం కానీ చర్చించడం కానీ జరగడంలేదు. కూలంకషంగా అధ్యయనం చేయడానికి ఎవరూ ముందు కు రావడంలేదు. కనీసం ఆ సామాజిక వర్గంలో ఉన్నత స్థానాలకు చేరినవారు, మేధావులు కూడా పట్టించుకోవ డంలేదు. గతంలో బ్రాహ్మణులపై సామాన్యజనానికి ఏర్పడిన అభిప్రాయాలకు, నేటి వాస్తవ స్థితిగతులకు పొం తనలేదు.

బ్రాహ్మణులకు గతంలో భూకమతాలున్నప్పటికీ, కారణాలేమైనా ఇప్పుడవన్నీ హరించాయి. సొంత భూములు కలిగి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుం బాలు చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చు. పెట్టు బడి పెట్టగలిగే స్థోమతలేని కారణంగా ఈ సామాజిక వర్గం పారిశ్రామిక, వ్యాపార వాణిజ్య రంగాలలో కూడా నామమాత్రంగానే కనిపిస్తుంది.

బ్రాహ్మణుల్లో దాదాపు 30 శాతం పౌరోహిత్యం చేసుకుంటూనో దేవాలయాల్లో పూజారులగానో జీవనం సాగిస్తున్నారు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారే. పూజారుల నెలసరి ఆదాయం రూ.1,500 కూడా ఉండదు. పురోహితుల నెలసరి ఆదాయం రూ.2,000కు మించదు. దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహించా లన్నా, పౌరోహిత్యం చేసుకోవాలన్నా, అందుకు అవసర మైన వేదవిద్యను అభ్యసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లు వేదపాఠశాలల్లో చదివిన తర్వాత కూడా వారి ఆదాయం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల జీతంకన్నా తక్కువే.
సమాజంలో వేద విద్యకు ఎలాంటి గౌరవమూ, గుర్తింపు ఇస్తున్నారో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. అర్చక వృత్తితో కుటుంబాన్ని పోషించుకోలేక పూజారులు దేవాలయాలకు తాళాలు వేసి వృత్తికి స్వస్తిపలికి వెళ్లి పోతున్న సంఘటనలు అసంఖ్యాకం. ఇక పౌరోహిత్యానికి ఎవరూ పిలవని రోజున ఆ కుటుంబం పస్తులుం డాల్సిందే. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో, హైదరాబాద్ చిక్కడపల్లి, ఇసామియా బజార్ వంటి చోట్ల మధ్యాహ్నం వరకు వేచి ఉండి, ఏ అవకాశమూ దొరక్క నిరాశతో ఇంటిముఖం పట్టే బ్రాహ్మణులను ప్రతిరోజూ చూడ వచ్చు. విజయవాడ, విశాఖపట్నం వంటి ఇతర నగరాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

భూమి హరించుకుపోవడంతో బ్రాహ్మణులు గ్రామా ల నుంచి పట్టణాలకు వలసపోయారు. ఫలితంగా గ్రామా ల్లో వారి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అక్కడక్కడ పూజారుల కుటుంబాలు మాత్రమే కనిపిస్తాయి. పట్ట ణాల్లో జీవన వ్యయం ఎక్కువ కాబట్టి, అత్యధిక బ్రాహ్మణ కుటుంబాలు చాలీచాలని వసతులతో బతుకులీడుస్తు న్నారు. చాలీచాలని ఇరుకు గదుల్లో కాపురం ఉంటు న్నారు. 69 శాతం పైగా బ్రాహ్మణ కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. అత్యధిక సంఖ్యాకులకు తెల్లరేషన్‌కార్డులు లేవు. ఆ కారణంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు లభించ టం లేదు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్సకు నోచుకోవడం లేదు.

వైద్యంతోపాటు విద్యారంగం ప్రైవేటీకరణ చెందడం తో ఇక్కట్లు పాలవుతున్నది బీదవర్గాలే. తుపాను వస్తే ముందు కూలిపోయేది పూరిగుడిసే. దానిలో ఉండేవారు ఏ సామాజిక వర్గాలకు చెందినవారైనా కావచ్చు. గుడిసెలో బ్రాహ్మణులున్నంత మాత్రాన వారిని తుపాను వదిలి పెట్టదు. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ కళాశాలలు పెట్టు బడిదారీ వ్యవస్థ మరో వికృతరూపం మాత్రమే. కార్పొ రేట్ విద్య ఉక్కు చక్రాల కింద నలిగిపోతున్న సామాజిక వర్గాల్లో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. గతంలో ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నత విద్యనభ్యసించేవారు అధికంగా ఉండేవారు. కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వారి సంఖ్య గణనీయంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఉన్నత విద్యనభ్యసించాలంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకురా వాలి. అందుకు ఉన్నత ప్రమాణాలు గల సెకండరీ స్కూళ్లలో, జూనియర్ కాలేజీల్లో చదువుకోవాలి. అటాంటి విద్యా సంస్థల్లో చదువుకోగలిగిన స్థోమతలేని కారణంగా ఈ సామాజికవర్గం విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల మెట్లు ఎక్కలేకపోతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్, మెడి కల్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో బ్రాహ్మణ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ సామా జికవర్గం విద్యార్థుల్లో 50 శాతం మంది పదవ తరగతి స్థాయిలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు.

ఇతర బీదవర్గాలలో లాగే ఈ సామాజికవర్గంలో కూడా ఆడపిల్లల వివాహాలు సమస్యగా మారాయి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న కుటుంబాలలోని ఆడపిల్లలకు తల్లిదండ్రులు యుక్తవయస్సులో పెళ్లిళ్లు చేయలేకపోతు న్నారు. అనేకమంది యువతులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. రాష్ట్రంలో అవివాహిత యువతులు బ్రాహ్మణ సామాజికవర్గంలోనే ఎక్కువ. అలాంటి వారిలో కొందరు నిస్పృహకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. అవివాహిత బ్రాహ్మణ యువతుల నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకొని వారిని బలవంతంగా ఎత్తుకు పోయిన, మోసగించిన సంఘటనలు హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్నాయి. కుటుంబం పరువుపోతుందనే వ్యథతో తల్లిదండ్రులు అలాంటి సంఘటనలు జరిగిన ప్పుడు ఫిర్యాదు చేయడం లేదు. ఇది సామాజిక అంశమే అయినా దీని మూలాలు పేదరికం లోనే ఉన్నాయి.

పెళ్లిళ్ల విషయంలో మరో పార్శ్వం కూడా ఉంది. పౌరోహిత్యం చేసుకొంటున్న లేక అర్చకులుగా ఉన్న యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముం దుకు రావడం లేదు. వారి వేషభాషలు నచ్చడంలేదు. నామోషీ ఫీలవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోన్, శ్రీకా కుళం జిల్లా పాలకొండ గ్రామాలకు నేను వెళ్లినప్పుడు తమను పెళ్లి చేసుకోవడానికెవరూ ముందుకు రావడం లేదని అనేక మంది బ్రాహ్మణ యువకులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. అర్చకులుగా ఉన్న యువకులు ఆ వృత్తి వదిలేస్తే తప్ప తమకు పెళ్లికాదనే నిర్ధారణకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అర్చకులు కరువై దేవాలయాలు మూత పడే ప్రమాదం ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి ఒకరు, ఆ ఉద్యోగాన్ని వదిలి అర్చకత్వంలోకి వచ్చినందుకు భార్య విడాకులిచ్చి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది.

ఈ సామాజిక వర్గంలో వితంతువులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అటువంటి వారికి అధికార యం త్రాంగం పెన్షన్లు ఇవ్వడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వాధికారి ఒకరు నేను ఎంతగా చెప్పి చూసినా ఏవో కుంటిసాకులు చూపి ఒక బ్రాహ్మణ వితంతువుకు పెన్షన్ నిరాకరించాడు. ఇళ్లలో పనిచేసుకొని కొందరు వితంతు వులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిన్న పట్టణాలలో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు. చాలీచాలని ఆదాయంతో చిన్నపిల్లలను పెంచటం, చదివించటం వారికి దుర్భరంగా మారింది.

బ్రాహ్మణులు యూరోపియన్ దేశాలలోని యూదు లవలె శాపగ్రస్తులుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. గతంలో బ్రాహ్మణులు దురహంకారంతో ప్రవర్తించి ఉండవచ్చు. మిగిలిన కులాల మీద దాష్టీకాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. పూర్వీకుల అపరాధాలకు నేటి తరాన్ని బాధ్యులను చేయ డం భావ్యం కాదు. బ్రాహ్మణ సామాజికవర్గంలోని చెడు పోకడల మీద, ఆ సామాజికవర్గానికి చెందిన వారే తిరుగు బాటు చేశారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గురజాడ అప్పారావు, మాడపాటి హను మంతరావు వంటి మహనీయులు ఆ కుటుంబాల్లో సంస్క రణలు తెచ్చారు. విజయవాడలో ప్రభాకర ఉమామ హేశ్వర పండితులు 20వ శతాబ్దం తొలినాళ్లలో అస్పృ శ్యతా నివారణకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. సమా జాన్ని మేల్కొలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ‘తలారులు’ ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులే. అండమాన్ జైల్లో నరకయాతనలను అనుభ వించిన 500 మంది స్వాతంత్య్ర పోరాటయోధుల్లోనూ సగానికి సగం వారే.

హిందూ మతంపై కత్తికట్టిన వారు బ్రాహ్మణుల మీదే గురిపెడుతున్నారు. దీన్ని మించిన అసంబద్ధత మరొకటి లేదు. హిందూయిజం ఏ సామాజికవర్గం సొంతాస్తి కాదు. బ్రాహ్మణులు నశిస్తే అది అంతరించదు. వివేకానందుడు, అరవిందుడు, రామకృష్ణ మిషన్‌లోని సన్యాసులు బ్రాహ్మ ణ సామాజికవర్గానికి చెందిన వారు కాదు. మనుస్మృతి పేరు చెప్పి బ్రాహ్మణ సామాజికవర్గాన్ని చిన్నచూపు చూడ టం, వారిపై అప్రకటిత యుద్ధాన్ని సాగించడం తగనిపని. ఈనాడు మనుస్మృతి అమలులో లేదు. భారత రాజ్యాం గంలో మనుస్మృతి అంతర్భాగం కాదు. ఇది అందరికీ తెలిసిందే.
బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న వాస్తవ స్థితిగతులు వెలుగులోకి రావలసిన అవసరం ఉంది. అందుకు గాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్‌ను నియమించాలి. సమాజంలోని ఏ వర్గమూ ఉపేక్షకు గురికాకూడదన్నదే మన రాజ్యాంగ స్ఫూర్తి.