Total Pageviews

Tuesday, November 29, 2011

raitu kanta kanniru migilche rabi

రబీ పంటల సాగుపై రైతుల్లో ఉన్న ఉత్కంఠ నేడు వీడనుంది. రబీకి సాగునీటి సరఫరాకు అవకాశం లేదని ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో తేల్చటంతో రైతుల్లో ఆందోళన నెలకొనటం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఆందోళన చేపట్టటం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీటిని సాధించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించటం రైతుల్లో ఆశను రేకెత్తించింది. రబీ సీజనుకు పంట విరామానికి నిర్ణయిస్తూ కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ జిల్లాలో సాగునీటి సరఫరా ఉంటుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇన్ని సందేహాల నడుమ జిల్లా ఐఏబీ సమావేశం మంగళవారం ఏర్పాటుకానుంది. ఇందులో చేసే తీర్మానంతోనే ఇన్నిరోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడనుంది.

నాగార్జునసాగర్, కృష్ణాపశ్చిమడెల్టా పరిధిలోని ఆయకట్టులో రబీ సీజనులో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తుంటారు. పశ్చిమడెల్టా కిందకు వచ్చే తెనాలి డివిజనులో వరి తర్వాత మొక్కజొన్న సాగు విస్తారంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. మరో 30 వేల ఎకరాల్లో వరి వేస్తుంటారు. ధాన్యానికి ‘మద్దతు’ తక్కువగా ఉండటం, ఎరువుల ధరలు పెరగటంతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు ఏమాత్రం గిట్టుబాటుకాని పరిస్థితిలో మొక్కజొన్న ఒక్కటే రైతులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. చిన్న సన్నకారు రైతుల ఎకరాకు రూ.20-25 వేల వరకు కౌలుకు తీసుకుని మరీ సాగుచేస్తుంటారు. ఖరీఫ్‌లో సగటు దిగుబడులు సంతృప్తికరంగా ఉండేలా కనిపిస్తున్నా ధరలు నిరాశను కలిగిస్తున్నాయి. అందుకే మొక్కజొన్నకు సన్నాహాలు చేస్తున్నారు. కోత కోసి కుప్ప వేసిన చేలల్లో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు ఇప్పటికే మొక్కజొన్నను విత్తుతున్నారు. మిగిలిన రైతులు సాగునీటి సరఫరా నిర్ణయంకోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు ఐఏబీ సమావేశంలో పంట విరామం తీర్మానం అనివార్యమైతే మొక్కజొన్న రాబడిని రైతులు వదులుకోవాల్సిందే. డివిజనులోని రైతులు హీనపక్షం రూ.1000-1200 కోట్ల పంటను కోల్పోయినట్టు కాగలదు.

అదను దాటిన పంటలు..
సాగర్ ఆయకట్టు విషయానికొస్తే, రబీలో ఎక్కువగా మిర్చి పంటకు సాగునీటి అవసరం ఉంది. ఏటా ఆగస్టు/ సెప్టెంబరులో వేసే మిర్చిని వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్నిచోట్ల అక్టోబరు/నవంబరులోనూ వేయాల్సివచ్చింది. మొత్తం 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. జనవరి-ఏప్రిల్ నెలల్లో మిర్చి కోతకొస్తుంది. కాయ ఊరే సమయంలో సాగునీటి అవసరం ఎంతగానో ఉంటుంది. పంట విరామం నిర్ణయమైతే కాలువనీటిపై ఆధారపడిన లక్ష ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింటుంది. ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే కనీసం పది క్వింటాళ్ల దిగుబడి పడిపోతుందని రైతుసంఘం జిల్లా నాయకుడు రాధాకృష్ణ చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించుకుంటే కేవలం మిర్చి పంటతోనే రైతులు రూ.300-400 కోట్ల వరకు నష్టపోతారని చెప్పారు. సాగర్ ఆయకట్టులో ప్రధానంగా మిర్చి పంటను నష్టపోవాల్సి ఉంటుంది. మరో 20 వేల ఎకరాల్లో వేసే వరిపంటకు నూకలు చెల్లిపోతాయి.

పనిదినాలను కోల్పోతున్న కూలీలు..
పంటనష్టానికి తోడు వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరిలో కోత యంత్రాలు వచ్చాక కూలీలకు పనిదినాలు తక్కువయ్యాయి. మొక్కజొన్న, మిర్చికి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. మొక్కజొన్నలో ఎకరాకు కనీసం 50, మిర్చికి 200-250 పనిదినాలు అనివార్యంగా ఉంటాయి. రబీకి నీరివ్వకపోతే రెండు పైర్లకు కలిపి దాదాపు 1.75 కోట్ల పనిదినాలను కోల్పోవాల్సి వస్తుంది. అటు రైతులకు రాబడి లేకుండా, కూలీలు ఉపాధిని కోల్పోతే ఆ ప్రభావం జిల్లా ఆర్థికపరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వేరే చెప్పనవసరం లేదు. కేవలం కాలువల ఆధునికీకరణ కోసమని పంట విరామం ప్రకటించాల్సిన అవసరం లేదని రైతులు, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం. రబీ తర్వాత ఎన్ని నెలలు విరామం వస్తే అంతవరకు చేయగలిగిన పనులు చేస్తే చాలంటున్నారు. ఆధునిక యంత్రాలు వచ్చినందున రెండు నెలల్లో చేసే పనిని నెల వ్యవధిలో చేపట్టే అవకాశముందని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ పంట విరామం ప్రకటించి అవకాశం కల్పించినా, మూడేళ్లుగా బద్ధకం వదుల్చుకోని కాంట్రాక్టు సంస్థలు ఇప్పుడు వేగంగా స్పందించి పనిచేస్తాయన్న గ్యారెంటీ ఏముందనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి.
కాని  nedu జరిగిన సమావేశం లో ప్రతిపక్ష నాయకులూ , రైతులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కలెక్టర్  సమావేశం మధ్యలోనుచి అర్ధ్హతరంగ వెళ్ళిపోవడం పలు విమరలలకు తావుఇచ్చింది. తెలుగుదేశం నాయకులు కల్లెరచ్తే ని ముట్టడించి హడావిడి చేసారు.